English | Telugu
"యన్ టి ఆరే కనిపించారు" - దాసరి
Updated : Jan 6, 2012
"యన్ టి ఆరే కనిపించారు" అని దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నారు. వివరాల్లోకి వెళితే నందమూరి నట సింహం, యువరత్న నందమూరి బాలకృష్ణ శ్రీ రామచంద్ర మూర్తిగా, అందాల నయనతార సీతా మహా సాధ్విగా, నటసామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు వాల్మీకి మహామునిగా, శ్రీకాంత్ లక్ష్మణుడిగా, సాయి కుమార్ భరతుడిగా, మురళీ మోహన్ జనక మహారాజుగా నటించగా, బాపు గారి దర్శకత్వంలో యలమంచిలి సాయిబాబు నిర్మించిన అద్భుత పౌరాణిక చిత్ర రాజం "శ్రీ రామరాజ్యం".
ఈ "శ్రీ రామరాజ్యం" చిత్రం యొక్క అర్థ శతదినోత్సవ వేడుకలు హైదరాబాద్ శిల్పారామంలోని శిల్పకళా వేదికపై, సినీ అతిరథ, మహారథుల సమక్షంలో, అశేషంగా రాష్ట్రం నలుచెరగుల నుండి తరలి వచ్చిన బాలకృష్ణ అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఈ చిత్రం యూనిట్ ను దర్శకరత్న దాసరి నారాయణరావు అభినందిందిస్తూ ప్రసంగించారు.
"ఈ శ్రీరామరాజ్యం" సినిమా ఈ రోజుల్లో తీయటం ఒక సాహసం. అదికూడా ఒకప్పుడు చరిత్ర సృష్టించిన "లవకుశ" చిత్రాన్ని రీమేక్ చేయటం మరీ సాహసవంతమైన చర్య. ఆ పనిని దిగ్విజయంగా నిర్వహించిందీ చిత్రం యూనిట్. శ్రీరామచంద్రుడిగా బాలయ్యను చూస్తే ముచ్చటేసింది. కొన్ని సందర్భాల్లో బాలయ్య కనపడలేదు. అన్నగారు యన్ టి ఆరే కనిపించారా పాత్రలో. అంతబాగా నటించాడు బాలయ్య" అని అన్నారు.