Read more!

English | Telugu

హైదరాబాద్ లో బాలకృష్ణ, బాపు శ్రీరామరాజ్యం

హైదరాబాద్ లో బాలకృష్ణ, బాపు "శ్రీ రామరాజ్యం" సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమయ్యింది. వివరాల్లోకి వెళితే శ్రీ సాయిబాబా మూవీస్ పతాకంపై, యువ రత్న నందమూరి బాలకృష్ణ శ్రీరామచంద్ర మూర్తిగా, నయనతార సీతా మహా సాధ్విగా, శ్రీకాంత్ లక్ష్మణుడిగా, సాయికుమార్ భరతుడిగా, వినోద్ దారాసింగ్ ఆంజనేయస్వామిగా నటిస్తూండగా, గ్రేట్ క్రియెటీవ్ డైరెక్టర్ బాపు దర్శకత్వంలో, యలమంచిలి సాయిబాబు నిర్మిస్తున్న పౌరాణికి చిత్రం "శ్రీ రామరాజ్యం". బాలకృష్ణ, బాపు "శ్రీ రామరాజ్యం" సినిమాలో నటసామ్రాట్, పద్మవిభూషణ్, డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు వాల్మీకిగా నటిస్తున్నారు.

బాలకృష్ణ, బాపు "శ్రీ రామరాజ్యం" సినిమాకి అద్భుత సినీ రచయిత స్వర్గీయ ముళ్ళపూడి వెంకటరమణ స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. ఆయన మాతలు వ్రాసిన చివరి చిత్రం "శ్రీ రామరాజ్యం" కావటం విశేషం. బాలకృష్ణ, బాపు "శ్రీ రామరాజ్యం" సినిమాకి మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. బాలకృష్ణ, బాపు "శ్రీ రామరాజ్యం" సినిమాలోని పాటలను జొన్నవిత్తుల, వెన్నెలకంటి వ్రాస్తున్నారు.

 

బాలకృష్ణ, బాపు "శ్రీ రామరాజ్యం" సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని అల్వాల్ లో ఈ చిత్రం కోసం, ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ నేతృత్వంలో కోటి రూపాయల ఖర్చుతో నిర్మించిన సెట్ లో జరుగుతూంది. నిజానికి బాలకృష్ణ, బాపు "శ్రీ రామరాజ్యం" సినిమా హీరో నందమూరి బాలకృష్ణ జన్మదినానన విడుదల కావలసింది. కానీ ఫెడరేషన్ సమ్మెవలన అనివార్యంగా బాలకృష్ణ, బాపు "శ్రీ రామరాజ్యం" సినిమా విడుదల ఆలస్యం అవుతుంది.