Read more!

English | Telugu

దేవతలా నడిచొచ్చిన సోనమ్..!

కేన్స్ అంటే కేవలం ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ మాత్రమే కాదు. రెడ్ కార్పెట్ మీద నడిచేవారికి మంచి పబ్లిసిటీ తీసుకొస్తుంది. అతిథుల డ్రెస్సింగ్ స్టైల్ ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తుంటుంది. అందుకే ఇక్కడకు రావడాన్ని అంత అదృష్టంగా భావిస్తారు సెలబ్రిటీలు. ఇండియా నుంచి గత కొన్నేళ్లుగా ఐశ్వర్యారాయ్, సోనమ్ కపూర్ లు రెగులర్ గెస్ట్ లుగా హాజరవుతున్నారు. అక్కడకు వెళ్లిన ప్రతీసారీ వీళ్ల డ్రెస్సింగ్ చూసి ప్రపంచం నోరెళ్లబెడుతుంటుంది. ఈ ఏడాది కూడా ఐష్, సోనమ్ లు అలాగు సందడి చేశారు.

సోనమ్ వేసిన డ్రస్ టాక్ ఆఫ్ ది కేన్స్ గా మారింది. తెల్లటి పొడవైన రోబ్స్ తో, దేవతలా ఆమె నడిచివస్తుంటే, ఫోటోగ్రాఫర్లందరూ కళ్లప్పగించి చూశారు. బ్రిటిష్ డిజైనర్ రాఫ్ అండ్ రూసో డిజైన్ చేసిన ఈ డ్రస్ తో సాయంత్రం వేళ కేన్స్ రెడ్ కార్పెట్ పై హొయలు పోయింది సోనమ్ కపూర్. ఇప్పటికే బాలీవుడ్ లో ఫ్యాషన్ కు ఐకాన్ గా ఆమెకు ఉన్న పేరు, ఈ కేన్స్ అప్పియరెన్స్ తో కరెక్ట్ అని ప్రూవ్ చేసుకుంది అంటున్నారు ఆమె అభిమానులు.