Read more!

English | Telugu

క్రిస్ గేల్ కి స్నేహా ఫిదా అయిపోయిందా..? ఆ విషయం తెలియదేమో..?

 

మొన్నీమధ్యనే వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ తో పార్టీలో దిగిన ఫొటోలు పెట్టి ఓ రెండు రోజులు హడావుడి చేసింది బాలీవుడ్ నుండి ఇంపోర్ట్ అయి టాలీవుడ్లో నటించిన భామ స్నేహ ఉల్లాల్. ఇప్పుడు మరోసారి క్రిస్ గేల్ గురించి కోతలు కోసేస్తుంది ఈ అమ్మడు. తమ పరిచయం గురించి చెబుతూ.. ఓ ప్రైవేట్ పార్టీలో తాము కలిశామని.. అతనే నా దగ్గరికి వచ్చి మాట్లాడాడని గారాలుపోతూ చెప్పుకుంటోంది. అంతేకాదు అప్పుడే ఇద్దరూ ఫోన్ నెంబర్లు ఇచ్చుకోవడం జరిగిందని.. ఆ తర్వాత నుంచి అప్పుడప్పుడు మాట్లాడుకోవటం జరుగుతుందని చెప్పుకొచ్చింది. అక్కడితో ఆగకుండా..  తనను మనిషి రూపంలో ఉన్న బొమ్మవంటూ కామెంట్ చేస్తాడని చెప్పింది. పాపం క్రిస్ గేల్ కు మొదటి నుండి అమ్మాయిలంటే కాస్త ఇంట్రస్ట్ ఎక్కువే అని ఈ భామకి తెలియదనుకుంటా. అందుకే తన పొగడ్తలకు ఫిదా అయిపోయానట్టు కనిపిస్తోంది.