Read more!

English | Telugu

ఓటీటీలోకి సిద్ధార్థ్ రాయ్.. మరో అర్జున్ రెడ్డి..!

ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన దీపక్ సరోజ్ హీరోగా పరిచయమైన చిత్రం 'సిద్ధార్థ్ రాయ్'(Siddharth Roy). ఈ రొమాంటిక్ డ్రామాని యశస్వి దర్శకత్వంలో జయ అడపాక నిర్మించారు. 'అర్జున్ రెడ్డి' సినిమా ఛాయలతో ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం ఫిబ్రవరి 23న థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన ఈ మూవీ.. రెండు నెలల తర్వాత ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది.

 

‘సిద్ధార్థ్ రాయ్’ మూవీ రివ్యూ

 

'సిద్ధార్థ్ రాయ్' ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ ని ఆహా దక్కించుకుంది. ఈ సినిమాని మే 3 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది. ఇటీవల థియేటర్లలో అంతగా ఆదరణ పొందని కొన్ని సినిమాలు.. ఓటీటీలో మ్యాజిక్ చేస్తున్నాయి. మరి యూత్ ఫుల్ మూవీ 'సిద్ధార్థ్ రాయ్' కూడా అలాంటి మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి.