Read more!

English | Telugu

అట్లుంటది మరి సిద్దుతో.. హీరో సిద్ధర్థ్ , పెళ్లి లో మాములు ట్విస్ట్స్ లేవుగా..!


హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరీ ప్రేమించుకుంటున్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కొంతకాలంగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఆ వార్తలను నిజం చేస్తూ తాజాగా వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయ మండపంలో జరిగిన ఈ పెళ్లికి.. ఇరు కుటుంబాలతో పాటు అతికొద్దిమంది బంధువులు, స్నేహితులు హాజరయ్యారని సమాచారం.

ఇది నిన్నటివరకు వున్న వార్త.. ఈ పెళ్లి చేసుకుంది మాములు వ్యక్తుల .? ఇద్దరు సినిమా నటులు.. అందులోనూ హీరో హీరోయిన్లు.. అయితే శ్రీరంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయ  లో షూటింగ్ అని చెప్పి పర్మీషన్ తీసుకున్నారంట.. అక్కడ పనిచేసే ఆలయ పూజారులను బైటకు పంపి.. బైటనుండి సామాన్య భక్తులను లోపాలకి రానివ్వకుండా పెళ్లి తంతు పూర్తి చేసేరంట.. ఇందుకోసం తమిళనాడు నుండి పండితులని తీసుకొచ్చారు  సిద్దు స్టాఫ్.. అదితిరావు హైదరి తల్లి విద్యారావు తెలంగాణకు లో  వనపర్తి సంస్థానానికి చెందిన రాజు జె రామేశ్వరరావు కుమార్తె .. సో జె రామేశ్వరరావు వారసులు జె కృష్ణదేవరవు కుటుంభం ఈ హాజరయింది. పెళ్లి గురించి మీడియా లో వార్తలు వచ్చాక అక్కడ ఆలయ నిర్వాకులు , స్థానికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.. 

అయితే కొంతకాలంగా అదితిరావుతో ప్రేమలో ఉన్నాడు సిద్ధార్థ్. వీరిద్దరూ కలిసి 'మహాసముద్రం' అనే సినిమాలో నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరు ప్రేమలో పడినట్లు సమాచారం. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరిగిన పలు ఫొటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. 

ఈ సంవత్సరమే సిద్ధార్థ్, అదితిరావు పెళ్లి చేసుకోబోతున్నారని కొద్దిరోజుల క్రితం వార్తలొచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలు నిజమైనట్లు సమాచారం. అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరిద్దరూ ఒక్కటయ్యారట. కాగా, అదితిరావుకి కూడా గతంలోనే పెళ్లి జరగగా, ఏవో కారణాల వల్ల కొంతకాలానికే భర్త నుంచి విడాకులు తీసుకుంది.