English | Telugu

హైకోర్టులో శ్యామల.. నేను సాంప్రదాయినీ, సుద్దపూసనీ!

హైకోర్టులో శ్యామల.. నేను సాంప్రదాయినీ, సుద్దపూసనీ!

ఈమధ్యకాలంలో టాలీవుడ్‌, బుల్లితెర ప్రముఖులు ఏదో ఒక విషయంలో వార్తల్లోకి ఎక్కుతూ ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రముఖులపై అన్ని రకాల కేసులు నమోదవుతున్నాయి. వాటిలో నిజానిజాలు ఏమిటి అనేది తెలియకపోయినా కేసుల ద్వారా వాళ్లు తెరపైకి వస్తున్నారు. ఈమధ్యకాలంలో ఎంతో మంది సోషల్‌ మీడియాలో, మీడియాలో వివరణ ఇచ్చుకున్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న వార్త బెట్టింగ్‌ యాప్స్‌. ఈ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు సినీ, టీవీ ప్రముఖులు. ఆ క్రమంలోనే ఇప్పటికే ఎంతో మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇంకా ఎంతమంది ఈ ప్రమోషన్స్‌లో ఉన్నారనే వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. 

బుల్లితెర నటిగా మాత్రమే కాకుండా రాజకీయాల్లోనూ తన వాణి వినిపిస్తూ, కొన్నిసార్లు విమర్శల పాలవుతూ వస్తున్న శ్యామలపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమధ్య శ్యామల ఒక ఆన్‌లైన్‌ యాప్‌ను ప్రమోట్‌ చేస్తూ ఈజీగా డబ్బు ఎలా సంపాదించాలి అనే అంశాలను ప్రస్తావిస్తూ వీడియోలు చేసింది. దాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తనపై నమోదైన కేసును క్వాష్‌ చేయాలని హైకోర్టులో పిటిషన్‌ వేసింది శ్యామల. శుక్రవారం హైకోర్టులో శ్యామల వేసిన పిటిషన్‌ తాలూకు విచారణ జరగనుంది.