English | Telugu

శృతి హాసన్ కి జన్మదిన శుభాకాంక్షలు

శృతి హాసన్ కి జన్మదిన శుభాకాంక్షలు. వివరాల్లోకి వెళితే భారతదేశం గర్వించతగ్గ నటుడు, సకలకళావల్లభుడు, పద్మశ్రీ, డాక్టర్ కమల్ హాసన్ పెద్ద కుమార్తె శృతి హాసన్. శృతి హాసన్ మల్టీటాలెంటెడ్ గర్ల్ శృతి హాసన్ నటి మాత్రమే కాదు. చక్కని సంగీత దర్శకురాలు, సుమధుర గాయని కూడా. ఆమె తెలుగులో అనగనగా ఓ ధీరుడు, ఓ మై ఫ్రెండ్ వంటి చిత్రాల్లో నటించారు. అలాగే ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‍ సరసన, హరీష్ శంకర్ దర్శకత్వంలో, బండ్ల గణేష్ నిర్మిస్తున్న "గబ్బర్ సింగ్" అనే సినిమాలో హీరోయిన్ గా నటించబోతోంది. అలాంటి శృతి హాసన్ జన్మదినం నేడు. అందుకని శృతి హాసన్ కి తెలుగువన్ డాట్ కామ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.