English | Telugu
షారుఖ్ ఖాన్, సుకుమార్ కాంబోలో బిగ్గెస్ట్ ఫిల్మ్..?
Updated : Mar 15, 2025
ఇండియా బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకరైన షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan), స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) తో చేతులు కలపబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. అదే నిజమైతే, కేవలం అనౌన్స్ మెంట్ తోనే ఈ సినిమా సంచలనాలు సృష్టిస్తుంది అనడంలో సందేహం లేదు.
'పఠాన్', 'జవాన్' సినిమాలతో వరుసగా రెండుసార్లు రూ.1000 కోట్ల క్లబ్ లో చేరిన షారుఖ్.. తన బాక్సాఫీస్ పవర్ ఏంటో మళ్ళీ చూపించాడు. మరోవైపు సుకుమార్ కూడా 'పుష్ప-2'తో దాదాపు రూ.1800 కోట్లు కొల్లగొట్టి, పాన్ ఇండియా వైడ్ గా సంచలనం సృష్టించాడు. అలాంటిది ఈ ఇద్దరు కలిసి ఒక సినిమా చేయబోతున్నారనే వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. సినీ అభిమానులైతే ఎప్పుడెప్పుడు అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందా అని ఎక్సైట్ అవుతున్నారు. అయితే షారుఖ్-సుకుమార్ కాంబినేషన్ వార్తలు ఎంతవరకు నిజమో కానీ, ఇప్పట్లో అయితే వీరి కాంబో ఫిల్మ్ కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
షారుఖ్ చేతిలో కింగ్, పఠాన్-2 వంటి సినిమాలు ఉన్నాయి. సుకుమార్ కూడా రామ్ చరణ్ తో సినిమా కమిటై ఉన్నాడు. ఆ తర్వాత పుష్ప-3 కూడా లైన్ లో ఉంది. ఇద్దరు కలిసి సినిమా చేయాలంటే కనీసం రెండేళ్లు పట్టే అవకాశముంది. మరి షారుఖ్-సుకుమార్ కలయికలో నిజంగానే సినిమా వస్తుందా? వస్తే ఎప్పుడు? అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
