English | Telugu

అమ్మవారి గుడిపై దాడి జరుగుతుంటే ప్రకాష్ రాజ్ చూస్తున్నాడా

రీసెంట్ గా  సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ గుడి పై ఒక దుండగుడు దాడి చేసి అమ్మవారి విగ్రహాన్నికాలితో తన్నిన విషయం ఇపుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. హిందువులు అయితే ఈ సంఘటనతో ఎంతగానో కలత చెందుతున్నారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నారు.

పలువురు రాజకీయ నాయకులు, మేధావులు ముత్యాలమ్మ గుడి ప్రాంతాన్ని సందర్శించి ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యల్ని తీసుకోవాలని కూడా ప్రభుత్వాన్నికోరుతున్నారు.ఇక ఈ దేశంలో జరిగే ప్రతి దారుణం మీద అందరి కంటే ఎక్కువగా స్పందించే  ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ ముత్యాలమ్మ గుడి మీద దాడి జరిగితే ఎందుకు మాట్లాడటం లేదనే విషయాన్నీ సోషల్ మీడియా వేదికగా పలువురు లేవనెత్తుతున్నారు.సెక్యులరిజం హిందువులకి వర్తించదా అని కూడా అడుగుతున్నారు. 

ప్రకాష్ రాజ్ మొదటి నుంచి కూడా హిందూ ధార్మిక సంస్థల మీద, వ్యక్తుల మీద దాడి జరిగినప్పుడు ఏ నాడు  స్పందించలేదు. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతి లడ్డు  విషయంలో కల్తీ జరిగిందని  తన ఆవేదనని వ్యక్తం చెయ్యడంతో పాటుగా దీక్ష చేసి సనాతన ధర్మానికి మద్దతుగా మాట్లాడితే పవన్ పై ప్రకాష్ రాజ్ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.