Read more!

English | Telugu

సర్దార్‌ థియేటర్‌లో కత్తుల యుద్ధం.. యువకుడి మృతి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఉగాది కానుకగా ఇవాళ థియేటర్లలో దిగింది. అయితే తమ అభిమాన హీరో సినిమాను తొలిరోజే చూసేందుకు వీరాభిమానులు పాట్లు పడుతుంటారు. సినిమా విడుదల సందర్భంగా కొన్ని చోట్ల అపశృతులు చోటు చేసుకున్నాయి. దాంతో పాటు తమ ఆరాధ్య నటుడి మీద ఈగ వాలినా పవన్ ఫ్యాన్స్ సీరియస్ అయిపోతారు. ఇలా పవన్‌ని కామెంట్ చేశారని ఒక అభిమాని ఘర్షణకు దిగి ప్రాణాలు కొల్పోయాడు. కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లా పావగడలోని అలంకార్ థియేటర్లో అభిమానుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రాకేశ్ నాయక్ అనే యువకుడు పవన్ వీరాభిమాని సినిమా చూడటానికి పట్టణంలోని అలంకార్ థియేటర్‌కు వెళ్లాడు. సినిమా చూస్తున్న సమయంలో పవన్‌ని వేరే యువకుడు కామెంట్ చేయడంతో..రాకేశ్ వారితో గొడవపడ్డాడు. దీంతో అవతలి వ్యక్తి కత్తితో పొడిచాడు. ఈ దాడిలో రాకేశ్‌నాయక్ అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు.