Read more!

English | Telugu

సర్దార్ గబ్బర్ సింగ్ ఫస్ట్ రివ్యూ (యూకే)..!

సర్దార్ గబ్బర్ సింగ్ అదిరిపోయింది. సూపర్ డూపర్ హిట్. నేనైతే 5/5 రేటింగ్ ఇస్తాను అంటూ చెబుతున్నాడు ఉమైర్ సంధు. యూకే సెన్సార్ బోర్డ్ మెంబర్, మిడిల్ ఈస్ట్ డిస్ట్రిబ్యూటర్ అంటూ చెప్పే ఉమైర్ సంధు, తాను డిస్ట్రిబ్యూటర్ ఫస్ట్ కాపీ చూశానని, సినిమా వందశాతం బ్లాక్ బస్టర్ అని ఘంటాపథంగా చెబుతున్నాడు. తన ట్విట్టర్లో, పైసా వసూల్ ఫిల్మ్, పవర్ స్టార్ పెర్ఫామెన్స్ విజిల్స్ వేయిస్తుంది. పవన్ స్టైల్ తో ఇరగదీసేశాడు. కాజల్ మళ్లీ హిట్టుకొట్టింది. విలన్ గా శరద్ ఖేల్కర్ ఫెంటాస్టిక్ పెర్ఫామన్స్ ఇచ్చాడు అంటూ ట్వీట్ చేశాడు. సింపుల్ స్టోరీ, బెస్ట్ స్క్రీన్ ప్లే, క్రిస్పీ ఎడిటింగ్, చప్పట్లు కొట్టించే డైలాగులు, విజిల్స్ వేయించే స్టంట్లు అంటూ సర్దార్ ను ఆకాశానికెత్తేశాడు. రిలీజవ్వగానే వెళ్లి చూడండి. స్ట్రాంగ్ లీ రికమెండెడ్ అంటూ ఐదుకు ఐదు స్టార్స్ ఇచ్చేశాడు సంధు.

సర్దార్ ను దుబాయ్ లో ఈరోజే స్క్రీనింగ్ వేస్తున్నారన్న మాట నిజమే. కానీ అది మార్నింగ్ టైం లోనా లేక రాత్రా అన్నది స్పష్టత లేదు. మరో వైపు బాహుబలి రిలీజ్ టైం లో, రెండు స్టార్స్ రేటింగ్ ఇచ్చి, సినిమా పరమ చెత్తగా ఉంది అని కియారా సంధు పేరుతో ఒక వ్యక్తి హల్ చల్ చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అమ్మాయిగా చెప్పుకున్న ఆ కియారా సంధు ఎకౌంట్ లో, ఎడిటర్ ఆఫ్ ఫిల్మ్ మ్యాగజైన్, దుబాయ్ సెన్సార్ బోర్డ్ మెంబర్ అని చెప్పుకుంది. ఇప్పుడు సర్దార్ రివ్యూ ఇచ్చిన ఉమైర్ సంధు ట్విట్టర్ ఎకౌంట్ లో యూకే సెన్సార్ బోర్డ్ మెంబర్, మిడిల్ ఈస్ట్ డిస్ట్రిబ్యూటర్ అని చెప్పుకోవడం గమనార్హం. రివ్యూ సరైందో కాదా అన్నది పక్కన పెడితే, పవన్ ఫ్యాన్స్ మాత్రం సర్దార్ రికార్డ్ బ్రేకింగ్ బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నారు. ఈరోజు రాత్రి బెనిఫిట్ షో టైం కి, పెర్ఫెక్ట్ సర్దార్ రివ్యూ బయటికొచ్చే అవకాశం ఉంది.