English | Telugu

బాల‌య్యని పేర‌డీ చేసిన సంపూ

నీకు బీపీ వ‌స్తే నీ పీకే వ‌ణుకుతాడేమో
నాకు బీపీ వ‌స్తే ఏపీ వ‌ణుకుద్దీ..
- ఇదీ లెజెండ్‌లో బాల‌య్య డైలాగ్‌.
దీన్ని సంపూ పేర‌డీ చేశాడు... సింగం 123 కోసం
నీకు బీపీ వ‌స్తే నీ చంచాగాళ్లు భ‌య‌ప‌డ‌తారేమో
నాకు బీపీ వ‌స్తే... ఏపీ తెలంగాణ రాయ‌ల‌సీమ కేర‌ళ బీహార్ క‌ర్నాట‌క‌... దేశం మొత్తం వ‌ణుకొద్ది.. అంటూ ఆల్ ఇండియాకి వినిపించేలా గ‌ర్జించాడు సంపూ. ఆఖ‌రికి రేసుగుర్రంలో బ‌న్నీ డైలాగ్‌నీ వ‌ద‌ల్లేదు. రేసులో ఉన్న‌వాళ్ల‌ని అందుకోవ‌డానికి నేను రేసుగుర్రాన్ని కాదు... రెడ్ బుల్ తాగిన సింహాన్ని.. అంటూ మ‌ళ్లీ వీర ప్ర‌తాపం చూపించాడు. ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో ఈ ట్రైట‌ర్ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. వీలుంటే మీరూ ఓ లుక్కేయండి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.