Read more!

English | Telugu

యూటర్న్ తీసుకుంటున్న సమంత..!

ఇప్పుడున్న హీరోయిన్లలో అత్యంత సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది షార్ట్ బ్యూటీ సమంత. తన తోటి వాళ్లందరికీ అవకాశాలు తగ్గిపోతుంటే, సమంతకు మాత్రం అవకాశాలు వరస వెల్లువెత్తుతున్నాయి. 2016 సమ్మర్ ఈ భామకు బాగా కలిసొచ్చింది. స్యామ్ నటించిన నాలుగు సినిమాలు ఈ సమ్మర్లో సందడి చేస్తున్నాయి. ఇప్పటికే తమిళ తెలుగు భాషల్లో రిలీజై విజయ్ తేరీ సినిమా వంద కోట్ల క్లబ్బులో చేరడంతో పాటు సూర్య 24 సినిమా కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇవి గాక భారీ అంచనాల మధ్య రిలీజ్ కానున్న బ్రహ్మోత్సవం, అ..ఆ సినిమాలు రెడీగా ఉండటంతో ప్రస్తుతానికి గోల్డెన్ లెగ్ లేడీకి తిరుగు లేనట్టే.

కానీ ఎన్నో సూపర్ హిట్స్ ఉన్న సమంత కెరీర్లో ఇప్పటి వరకూ లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ చేయకపోవడం ఒక్కటే లోటు. ఆ లోటును కూడా ఇప్పుడు భర్తీ చేసేయడానికి అమ్మడు రెడీ అవుతోంది. కన్నడలో సూపర్ హిట్ అయిన సస్పెన్స్ థ్రిల్లర్ ' యు టర్న్ ' ను తెలుగు తమిళంలో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది సమంత. ఈ సినిమా కోసం బెంగళూరు వెళ్లి చూసి వచ్చానని, తెలుగు తమిళ వెర్షన్లలో తానే హీరోయిన్ గా చేస్తున్నానని కన్ఫామ్ కూడా చేసింది. అయితే ఈ సినిమాకు నిర్మాత కూడా తనే అని వచ్చిన వార్తల్ని మాత్రం ఖండించింది. సినిమాలో సమంత ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్ర పోషిస్తుందని సమాచారం. యు టర్న్ రీమేక్ సమంత చేస్తున్న మొదటి సస్పెన్స్ థ్రిల్లర్ కావడం విశేషం.