English | Telugu

సల్మాన్ కి వాచ్ తొడిగింది జాకబ్ అరబో..ఖరీదు 42 కోట్లు 

బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్(salman khan)యాక్టింగ్ గురించి గాని, సాధించిన ఘన విజయాల గురించి గాని కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. 1989 లో వచ్చిన ప్రేమ పావురాలు దగ్గర్నుంచి లాస్ట్ ఇయర్ థియేటర్స్ లో అడుగుపెట్టిన టైగర్ 3  దాకా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటిస్తూ తనదైన నటనతో ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్నాడు. సల్మాన్ తాజాగా ఒక వాచ్ ని   ధరించాడు. ఇక అంతే  నిమిషాల్లో సల్మాన్ మ్యాటర్ వైరల్ గా మారింది. 

 జాకబ్ అరబో.. 1986లో జాకబ్ అండ్ కంపెనీని స్థాపించి అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్‌గా ఎదిగిన ప్రముఖ  అమెరికన్ జ్యువెలరీ అండ్  వాచ్ డిజైనర్. వరల్డ్ వైడ్ గా ఉన్న  ఖరీదైన వాచ్ లకి అతి పెద్ద బ్రాండ్ అంబాసిడర్ ఎంతో  పేరు ప్రఖ్యాతులని సంపాదించాడు.రీసెంట్ గా సల్మాన్ కి ఒక ఖరీదైన  వాచ్ ని తొడిగాడు.దాని విలువ అక్షరాల  నలభై రెండు కోట్ల రుపాయాలు. 714 డైమండ్స్ దాకా ఆ వాచ్ లో ఇమిడి ఉంటాయి. ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఆ వాచ్ ని తొడిగిన పిక్ ని  సల్మాన్  తన ఎక్స్ వేదికగా షేర్ చేసుకోవడంతో ఈ విషయం బయటకి వచ్చింది. ఆ వీడియో చూసిన  సల్మాన్  ఫ్యాన్స్, నెటిజన్స్  అయితే ఆ వాచ్ ని  జాకబ్ నిజంగానే సల్మాన్ కి ఇచ్చాడా లేకా కాసేపు అలా తొడిగాడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సినిమాల విషయానికి వస్తే సల్మాన్ ప్రస్తుతం సికందర్(sikandar)అనే మూవీ చేస్తున్నాడు.ఇటీవల ఒక ఫైటింగ్ సీక్వెన్స్  లో సల్మాన్ కి  గాయాలు అయ్యాయి. కానీ  వచ్చే రంజాన్ కి రిలీజ్ చెయ్యాలనే పట్టుదలతో  షూటింగ్ లో పాల్గొంటున్నాడు. చిరంజీవి(chiranjeevi)తో స్టాలిన్ ని తెరకెక్కించిన మురుగుదాస్(murugadoss)దర్శకుడు కాగా రష్మిక(rashmika) హీరోయిన్.సల్మానే ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు.