Read more!

English | Telugu

సుల్తాన్ బరిలోకి దిగాడు.. !

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ లేటేస్ట్ మూవీ సుల్తాన్. ఎప్పుడెప్పుడా అని బాలీవుడ్ జనాలు ఎదురుచూస్తున్న ఈ మూవీ టీజర్‌ని ఆ చిత్ర యూనిట్ విడుదల చేసింది. సల్మాన్ ఖాన్ తన అఫిషీయల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా అభిమానులతో టీజర్‌ను షేర్ చేశాడు. ఈ టీజర్‌లో సల్లూభాయ్ కండల తిరిగిన బాడీతో బరిలోకి ప్రత్యర్థిని ఒక్క పట్టుకే మట్టికరిపిస్తూ మీసం మెలేస్తుంటే అవతలున్నోడికి దడే. ఈ టీజర్ సల్మాన్ అభిమానులను మెస్మరైజ్ చేసింది. రిలీజైన కొద్దిసేపటికే లైక్‌లు, షేర్‌లతో యూట్యూబ్‌లో మోత మోగిపోతోంది. ఈ ఒక్క టీజర్‌తో బాలీవుడ్ మొత్తాన్ని తన వైపుకు తిప్పకున్నాడు సల్మాన్ .

హర్యానాకు చెందిన రెజ్లర్ సుల్తాన్ ఆలీ ఖాన్ జీవిత కథ ఆధారంగా యశ్‌రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్యా చోప్రా నిర్మిస్తుండగా ఆలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో సల్మాన్ ఖాన్‌కు జోడీగా అనుష్క శర్మ నటిస్తోంది.