Read more!

English | Telugu

సలార్ బైక్ ప్రభాస్ ఫ్యాన్స్ దే కాదు మీది కూడా..నేను చెప్పినట్టు చెయ్యండి  

గత ఏడాది డిసెంబర్ చివరలో సిల్వర్ స్క్రీన్ మీద  పాన్ ఇండియా లెవల్లో పెను విధ్వంసమే జరిగింది. అదేనండి ప్రభాస్  సలార్ రిలీజ్ అయ్యింది. సలార్ థియేటర్స్ లో ఉన్నంత సేపు బాక్స్ ఆఫీస్ వద్ద జాతరే. డార్లింగ్  ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా తండోపతండాలుగా వెళ్లి మూవీని చూసారు. అందుకే రికార్డు స్థాయి కలెక్షన్స్ ని సాధించింది. లేటెస్ట్ గా   సలార్ కి సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు  సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ హోదాలో ఏప్రిల్ 21  ఆదివారం సాయంత్రం 5 : 30 గంటలకి సలార్  స్టార్ మా లో టెలికాస్ట్ కానుంది. ఈ విషయానికి సంబంధించి ప్రభాస్ ఫ్యాన్స్ కి అదిరిపోయే గుడ్ న్యూస్. సలార్ లో ప్రభాస్ వాడిన బైక్ ని మీరు గెలుచుకోవచ్చు.ఏంటి నిజామా అని అంటున్నారా! నూటికి నూరుపాళ్ళు ఇది నిజం.  అది ఎలా అంటే సలార్ టీవీ లో వస్తున్నంతసేపు కూడా ఒక పక్కన ప్రభాస్  బైక్ కనిపిస్తు ఉంటుంది.  మూవీ కంప్లీట్ అయ్యే వరకు బైక్ కనపడుతుంటుంది.అప్పుడు  మీరు చెయ్యవలిసిందల్లా  బైక్ ఎన్ని సార్లు కనపడిందో లెక్క పెట్టడమే.

 

ఆ తర్వాత 8 గంటలకి sms  లైన్స్ ఓపెన్ అవుతాయి. ఎన్ని సార్లు  బైక్ కనడిందో  9222211199 అనే నెంబర్ కి sms  పంపించడమే.ఆ సెల్ నెంబర్ కూడా స్క్రీన్ మీద కనపడుతుంది. ఇప్పుడు ఈ న్యూస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ వైరల్ అవుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా బైక్ గెలుచుకోవడానికి రెడీ అవుతున్నారు.