Read more!

English | Telugu

వైరల్ అవుతున్న సాయి పల్లవి వీడియో 

హీరోకి  హైట్, అందం కొంచం అటు ఇటుగా ఉన్నా కూడా విమర్శలు వస్తుంటాయి.అలాంటిది హీరోయిన్ విషయంలో వేరే చెప్పేలా. దేవ కన్య లాగ ఉండాలి. కానీ అందంతో కాకుండా  నటన ద్వారానే దేవ కన్య అనిపించుకున్న హీరోయిన్ సాయి పల్లవి.ప్రెజంట్ ఆమె క్రేజ్ హీరోకి ఇంచుమించు ఈక్వల్. ప్రస్తుతం నాగ చైతన్యతో తండేల్ అనే మూవీ చేస్తుంది. ఇక   తాజాగా ఆమె వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది

ఈ రోజు సాయి పల్లవి పుట్టిన రోజు. ఈ సందర్భంగా తండేల్ మేకర్స్ ఒక వీడియోని రిలీజ్ చేసారు. అందులో  తండేల్ లో సాయి పల్లవి నటిస్తున్న  సీన్స్ కి సంబంధించిన స్టిల్స్ ఉన్నాయి. నిమిషం ఇరవై సెకన్లు ఉన్న ఆ వీడియోలో   సాయి పల్లవి ఎంతో క్యూట్ గా ఉంది.పైగా షూట్ గ్యాప్ లో  తను చేసిన అల్లరి కూడా ఉంది.ఎవరు కూడా ఆ వీడియోని మిస్ అవ్వద్దు. పైగా సాయి పల్లవి కి సంబంధించిన పాత సినిమాల క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి.  ఒక్కటి మాత్రం నిజం. ఆ వీడియో చూసిన తర్వాత వెంటనే సాయి పల్లవి నటించిన సినిమాలని ఇంకోసారి చూస్తారు

సాయి పల్లవి తెలుగు ప్రేక్షకులకి లభించిన ఒక గొప్ప నటి. తన మొదటి చిత్రం ఫిదా తోనే తన కోసం సినిమాకి వెళ్లే పరిస్థితిని తీసుకొచ్చింది. దాన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు. ఆమె నటనకి ఎంత శక్తీ ఉందో అని..2005 ,2008 లో తమిళంలో రెండు సినిమాల్లో చేసినా 2015 లో వచ్చిన ప్రేమమ్ తో పూర్తి స్థాయి హీరోయిన్ గా మారింది. ఇక అక్కడ్నుంచి ఆమె సినీ ప్రయాణం జోరందుకుంది.మిడిల్ క్లాస్ అబ్బాయి, పడి పడి లేచే మనసు, మ్యారి 2 ,లవ్ స్టోరీ ,శ్యామ్ సింగరాయ్, విరాటపర్వం,గార్గి లాంటి చిత్రాల్లో నటించింది. ఆమె ఎలాంటి  సినిమా పడితే అలాంటి  సినిమా చెయ్యదు. అందుకే రెండు దశాబ్దాల సినీ కెరీర్ లో ఒక ఇరవై సినిమాల్లో మాత్రమే చేసింది.  బాలీవుడ్ లో తెరెకెక్కుతున్న రామాయణ్ లోను  సీతగా చేస్తుంది. యానిమల్ రణబీర్ కపూర్ రాముడుగా చేస్తున్నాడు