Read more!

English | Telugu

మెగాహీరోల 'గ్యాంగ్‌' వార్‌

 

మెగాహీరోల 'గ్యాంగ్‌' వార్‌సాయిధ‌ర‌మ్ తేజ్ వ్య‌వ‌హారం... రామ్‌చ‌ర‌ణ్‌కి త‌ల‌నొప్పిని తీసుకొస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ చిరు పాట‌ల్ని రీమేక్‌లుగా వాడేసే హ‌క్కు చ‌ర‌ణ్ కే ఉండేది. ఇప్పుడు అందులో వాటా అందిపుచ్చుకొన్నాడు సాయిధ‌ర‌మ్‌. గోలీమార్‌, గువ్వా గోరింక‌తో పాట‌ల్ని ఆల్రెడీ వాడేశాడు సాయి. ఇప్పుడు టైటిల్స్‌పై ప‌డ్డాడు. చిరంజీవికి ఎంతో ఇష్ట‌మైన గ్యాంగ్ లీడ‌ర్ టైటిల్‌ని సాయి వాడేద్దామ‌ని ఫిక్స‌య్యాడ‌ట‌. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో సాయిధ‌ర‌మ్ ఓ చిత్రంలో న‌టించ‌బోతున్నాడు. ఈ సినిమాకి గ్యాంగ్ లీడ‌ర్ అనే టైటిల్ పెడ‌దామ‌నుకొంటున్నారు. అయితే... ఇదే టైటిల్‌పై చ‌ర‌ణ్ కూడా చాలాకాలంగా క‌న్నేశాడు.

 

త‌న‌కు మంచి మాస్ క‌థ దొరికిన‌ప్పుడు ఈ టైటిల్ వాడేద్దామ‌నుకొన్నాడు. వీలు కుదిరితే.. గ్యాంగ్ లీడ‌ర్ సినిమాని రీమేక్ చేద్దామ‌నుకొన్నాడు. ఆ ఆశ‌ల్ని తుంచేస్తూ.... సాయి ఈ టైటిల్‌ని క‌న్‌ఫామ్ చేసుకోవ‌డం చెర్రీకి న‌చ్చ‌డం లేద‌ట‌. ఇదే విష‌యాన్ని చిరు ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్లాడ‌ట చ‌ర‌ణ్‌.  చిరంజీవి అనుమ‌తి లేకుండా ఈ టైటిల్ వాడ‌డం కుద‌ర‌ని ప‌ని. సాయి ఇప్పుడు త‌న మేన‌మామ‌కు ఎలాంటి స‌మాధానం చెబుతాడో మ‌రి!  చిరు త‌న టైటిల్‌కి వార‌సుడికి ఇస్తాడా, లేదంటే మేన‌ల్లుడికి వ‌దిలేస్తారా? అన్న‌దీ ఆస‌క్తిగా మారింది. ''ఇక నుంచి డాడీ పాట‌ల్ని రీమిక్స్ చేయ‌కు..'' అని చ‌ర‌ణ్ కూడా సాయికి గట్టి వార్నింగ్ ఇచ్చాడ‌ట‌. ఒకే కుటుంబంలో ఇంత మంది హీరోలుంటే ప‌రిస్థితి ఇలానే ఉంటుంది మ‌రి. ఇంత‌కీ ఈ గ్యాంగ్ లీడ‌ర్ టైటిల్ ఎవ‌రికి చిక్కుతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఎదురుచూడాలి.