English | Telugu
ప్రభాస్‌తో దాన్ని పెంచుకుంటున్న శ్రద్దాకపూర్
Updated : Sep 6, 2017
ఏమిటో.. ఈ మధ్య హీరోహీరోయిన్ల వ్యవహారాలు చిత్రంగా తయారయ్యాయ్. అదేం విడ్డూరమో... ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కుదిరితే కానీ పాత్రలు రక్తికట్టవట. అందుకే తెరమీదేకాదు. బయట కూడా చనువుగా మూవ్ అవుతుంటారు కొందరు హీరోహీరోయిన్లు. కాఫీ షాపుల్లో కలవడం... పబ్బుల్లో ఎంజాయ్ చేయడం ఇదంతా ఈ రోజుల్లో కామన్. అలా ఎంజాయ్ చేస్తూ ఒకరిపై ఒకరు అవగాహన పెంచుకుంటారన్నమాట. ప్రొడ్యూసర్ డబ్బులిస్తాడు. వీళ్లొచ్చి నటిస్తారు. పాత్రల్లో జీవిస్తే సరి. నిజజీవితంలో ఎందుకట? మరీ... ఇంతగా అవగాహన పెంచుకోవడం అవసరమా? అని చాలామంది అభిప్రాయం. ప్రస్తుతం ప్రభాస్, శ్రద్ధాకపూర్ అదే పనిలో ఉన్నారట. వీరిద్దరూ భౌతికంగా కలవక ముందే... ఫోన్లో తెగ మాట్లాడేసుకునేవారట. ఆ సమయంలో ప్రభాస్ ని ఎప్పుడు కలుస్తానా? అని తెగ ఆరాటపడిపోయిందట శ్రద్ధా. ఈ విషయాన్ని స్వయంగా శ్రద్ధాకపూరే సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఎట్టకేలకు ఇప్పుడు ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారు. అంతేకాదు లొకేషన్లో చాలా కలివిడిగా ఉంటున్నారని టాక్. ఒకరిపై ఒకరు అవగాహన పెంచుకునే పనిలో ఉన్నారన్నమాట. అలా పెంచుకుంటే తప్ప.. ఆన్ స్క్రీన్ పై కెమెమిస్ట్రీ సరిగ్గా వర్కవుట్ అవ్వదన్నమాట. అదండీ విషయం.