Read more!

English | Telugu

కాకిలా మారాలంటే ఎంత సేపు పడుతుందో తెలుసా..?

సూపర్ స్టార్ రజనీ హీరోగా, 2010 లో వచ్చిన రోబోకు సీక్వెల్ గా వస్తోంది రోబో 2.0. ఈమధ్యనే సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల్ని ఢిల్లీలోని స్టేడియంలో చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా విలన్ గా చేస్తున్న బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ లుక్ లీకయ్యింది. అక్షయ్ మేకప్ చూడగానే చాలా మంది సినీజనాలు అవాక్కయ్యారు. కాకిలా కనబడే విధంగా చేసిన ఆ మేకప్ చాలా విభిన్నంగా, వైవిధ్యంగా ఉంది. అయితే అక్షయ్ ను అలా తయారుచేయాలంటే దాదాపు ఆరు గంటలు పడుతుందట. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ప్రముఖ హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ షాన్ ఫుట్ ఆధ్వర్యంలో అక్షయ్ కు ఈ మేకప్ వేస్తున్నారు. షాన్ ఫుట్ ప్రపంచప్రఖ్యాత అవతార్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ లాంటి భారీ సినిమాలకు మేకప్ మ్యాన్ గా పనిచేశాడు. అవతార్ సినిమాకు మనిషిని త్రీడీ మ్యాపింగ్ చేసి, దానికి తగ్గట్టు మేకప్ రెడీ చేశారు. అదే విధంగా రోబో కోసం కూడా అక్షయ్ న్యూయార్క్ వెళ్లి మరీ బాడీ మొత్తాన్ని త్రీడీ మ్యాపింగ్ చేయించుకున్నారు. అక్షయ్ కష్టానికి తగ్గట్టే, ఈ లుక్ కు అన్ని వైపులా ప్రశంసలు కురవడమే కాక, సినిమాపై అంచనాల్ని మరింతగా పెంచేశాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న రోబో 2, భారతదేశంలోనే అత్యధిక బడ్జెట్ కలిగిన సినిమాగా చరిత్ర సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు సినీ పండితులు.