English | Telugu

"తుఫాన్" హెచ్చరికలు !!

అమితాబ్ "జంజీర్" చిత్రాన్ని రీమేక్ చేస్తూ రామ్‌చరణ్‌తో హిందీలో "జంజీర్" పేరుతోనే రీమేక్ చేస్తున్న చిత్రం తెలుగు వెర్షన్‌కు ఏ ముహూర్తాన "తుఫాన్" అన్న పేరు పెట్టారో కానీ.. అప్పటి నుంచి ఆ చిత్రం వివాదాల మరియు ఇబ్బందుల సుడిగుండాల్లో చిక్కుకుంటూనే ఉంది.

"జంజీర్" రచయితలైన సలీమ్_జావేద్‌లు తమ అనుమతి లేకుండానే ఈ చిత్రాన్ని రీమేక్ చేయ్యడంపై కోర్టును ఆశ్రయించడంతో ఈ చిత్రానికి మొదలైన ఇబ్బందులు.. ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న సంజయ్‌దత్ అరెస్ట్ కావడంతో తారాస్థాయికి చేరుకొన్నాయి. దాంతో ఈ వేసవికి విడుదల కావలసిన ఈ చిత్రం.. ఎప్పుడు విడుదలవుతుందో తెలియని పరిస్థితిలో పడిపోయింది.

దాంతో ఇప్పుడు "ఎవడు" చిత్రాన్ని జూలై నెలాఖరుకు విడుదల చేయడానికి యుద్ధప్రాతిపదికన సన్నాహాలు చేస్తున్నారు. వంశీపైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్ సరసన శ్రుతిహాసన్, అమీజాక్సన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు!

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.