English | Telugu

ఫస్ట్‌ రామ్‌చరణ్‌.. తర్వాతే అల్లు అర్జున్‌ : మైత్రి మూవీ మేకర్స్‌!

2018లో రామ్‌చరణ్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అల్లు అర్జున్‌తో సుకుమార్‌ చేసిన ‘పుష్ప’, ‘పుష్ప2’ చిత్రాలు సంచలన విజయాలు సాధించాయి. ముఖ్యంగా ‘పుష్ప2’ రికార్డు స్థాయి కలెక్షన్స్‌తో అంతకు ముందు వున్న రికార్డులను క్రాస్‌ చేసేసింది. ఇలా వరస విజయాలతో దూసుకెళ్తున్న సుకుమార్‌ నెక్స్‌ట్‌ సినిమా ఏమిటి? అనేది అందరిలోనూ ఉన్న ప్రశ్న. త్వరలోనే ‘పుష్ప3’ ఉంటుందని కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయం గురించి మైత్రి మూవీ మేకర్స్‌ అధినేతల్లో ఒకరైన నవీన్‌ ఎర్నేని క్లారిటీ ఇచ్చారు.

ఇటీవల విడుదలైన ‘డ్యూడ్‌’ చిత్రం పాజిటివ్‌ టాక్‌తో రన్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో జరిగిన సక్సెస్‌మీట్‌లో ‘పుష్ప3’ ఎప్పుడు ఉంటుంది అని పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు నవీన్‌ ఎర్నేని సమాధానమిస్తూ ‘మా బేనర్‌లో ఫస్ట్‌ రామ్‌చరణ్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో సినిమా ఉంటుంది. ప్రస్తుతం చరణ్‌ ‘పెద్ది’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అది పూర్తయిన వెంటనే ఏప్రిల్‌, మే నెలల్లో చరణ్‌, సుకుమార్‌ సినిమా స్టార్ట్‌ అవుతుంది’ అని వివరించారు. సో.. దీన్నిబట్టి ఇప్పట్లో ‘పుష్ప3’ ఉండకపోవచ్చని చెప్పకనే చెప్పారు.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.