English | Telugu

వర్మ ఏం చూపిస్తున్నాడు, విజయ్ ఎందుకు నవ్వుతున్నాడు

 

నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లాంటి సినిమాల్లో అలా కనిపించి ఇలా వెళ్లిన విజయ్ దేవరకొండ తర్వాత నాని నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం లో దూద్ కాశి అంటూ ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. ఈ కుర్రాడెవరో బానే ఉన్నాడు,  యాక్టింగ్ కూడా బానే చేస్తున్నాడు అని అనుకున్నారందరు. అయితే, విజయ్ కి ఫస్ట్ బ్రేక్ వచ్చింది మాత్రం పెళ్లి చూపులు తోనే. తెలంగాణ స్లాంగ్ లో అందర్నీ అలరించిన విజయ్, ద్వారక తో మొదటి ఫ్లాప్ మూటగట్టుకున్నాడు. మెచ్చుకున్న నోళ్లే విమర్శించడం మొదలెట్టాయి. విజయ్ వన్ మూవీ వండర్ అని, అతడికి అంత సీన్ లేదని, ఎక్కువ రోజులు ఇండస్ట్రీ లో ఉండలేడని దూషించారు. కొంత విరామం తర్వాత విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా సినీ అభిమానుల మెప్పుపొందడమే కాకుండా విజయ్ ని ఓవర్ నైట్ స్టార్ ని చేసింది. ప్రశంసలతో పాటు, కొందరి విమర్శలు ఎదుర్కొన్న విజయ్ కి మొదటి నుండి రామ్ గోపాల్ వర్మ సపోర్ట్ ఇస్తూ వచ్చాడు. కొందరయితే, విజయ్ ప్రవర్తన అచ్చమ్ వర్మ లాగే ఉందంటూ వ్యాఖ్యలు చేసారు. ఇదిలా ఉంటే, మొత్తానికి విజయ్ దేవరకొండ రామ్ గోపాల్ వర్మ ని కలిసాడు. ఈ ఫొటోలో వర్మ తన కండలు చూపిస్తుంటే సెల్ఫీ తీస్తున్న విజయ్ తెగ నవ్వుకుంటున్నాడు. ఇంతకీ, ఈ ఇద్దరూ ఏ విషయాలు మాట్లాడుకొని ఉండొచ్చు... ఇద్దరి మధ్య సినిమా ఉండే అవకాశం ఉందా... చూద్దాం!