English | Telugu

ప‌వ‌న్ ఫ్యాన్స్ బుద్దిలేనోళ్లా??

ఎప్పుడూ ఏదో ఓ ట్విట్‌తో ఎవ‌రినో ఒక‌రిని కెల‌క్క‌పోతే.. రాంగోపాల్ వ‌ర్మ‌కి నిద్ర‌ప‌ట్ట‌దు. వారూ వీరూ అని లేదు.. వ‌ర్మ తింగ‌రి ట్విట్ల‌కు అంద‌రూ బ‌లైపోవాల్సిందే. ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మ‌హేష్ బాబు లాంటి స్టార్ హీరోల్ని కూడా టార్గెట్ చేస్తూ.. ఏదోదో రాసేస్తుండే వ‌ర్మ ఇప్పుడు ప‌వ‌న్ ఫ్యాన్స్‌కి భీక‌రంగా కెలికేశాడు. వ‌వ‌న్ ఫ్యాన్స్ మ‌తిలేనిప‌నులు చేస్తుంటార‌ని, వాళ్లకు బుద్దిలేద‌ని ట్విట్ట‌ర్ సాక్షిగా ఘాటుగా విమ‌ర్శించాడు. ప‌వ‌న్ అభిమాని 1500 కిలోమీట‌ర్ల‌పాటు సైకిల్ తొక్కుకొంటూచ ప‌వ‌న్‌ని చేరుకొన్న సంగ‌తి తెలిసిందే. దీనిపై వ‌ర్మ స్పందించాడు. ఇది బుద్దిలేని ప‌ని అన్నాడు. టైమ్‌, ఎన‌ర్జీని వేస్ట్ చేసుకొంటూ ఇలా ప్ర‌వ‌ర్తించేవాళ్ల‌ని ప‌వ‌న్ అస‌లు ప్రోత్స‌హించ‌కూడ‌ద‌న్నాడు. భ‌విష్య‌త్తులో ఏ అభిమానీ ఇలాంటి ప‌నికిమాలిన ప‌ని చేయ‌కూడ‌ద‌ని, వ‌వ‌న్ వాళ్లంద‌రినీ హెచ్చ‌రించాల‌న్నాడు. ప‌వ‌న్‌ని ఏమైనా అంటేనే ఫ్యాన్స్ ఊరుకోరు. మ‌రి ఫ్యాన్స్‌నే టార్గెట్ చేశాడంటే... వ‌ర్మ‌కు వాళ్ల చేతుల్లో కౌంట్‌డౌన్ మొద‌లైన‌ట్టే.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.