English | Telugu
రామ్ గోపాల్ వర్మ కోరికను నెరవేర్చిన ఏపి పోలీసులు..అసలేం జరుగుతుంది
Updated : Nov 20, 2024
ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(ram gopal varma)ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(chandrababu naidu)ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్(pawan kalyan)పై గత ఎన్నికల సమయంలో సోషల్ మీడియా వేదికగా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఏపి లోని ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయిన విషయం తెలిసిందే.దీంతో మద్దిపాడు పోలీసులు వర్మ ని కలిసి విచారణకి హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు.ఈ విషయంపై వర్మ కోర్టుకి వెళ్లినా కూడా విచారణ తప్పదని కోర్టు తీర్పుని ఇచ్చింది. కానీ రామ్ గోపాల్ వర్మ నిన్న విచారణకి హాజరు కాకుండా మరికొంత సమయం కావాలని పోలీసులకి వాట్సప్ ద్వారా మెసేజ్ చేసాడు.
ఈ నేపథ్యంలో ఈ నెల 25న విచారణకు హాజరుకావాలని ఒంగోలు రూరల్ పోలీసులు వర్మకి మరోసారి నోటీసులు ఇచ్చారు.మరి ఈ నెల 25 తర్వాత కూడా వర్మ విచారణకి హాజరు కాకపోతే ఏం జరుగుతుందనే ఆసక్తి అందరిలో ఉంది.