Read more!

English | Telugu

రామ్ చరణ్ ' థృవ ' ఫస్ట్ లుక్...!

మెగా తనయుడు రామ్ చరణ్ కు ఇప్పుడు హిట్ చాలా అవసరం. తన తోటి హీరోలందరూ ఫాస్ట్ గా దూసుకెళ్లిపోతుంటే, చెర్రీ మాత్రం సినిమాల్లోనూ కలెక్షన్లలోనూ వెనకబడిపోయాడు. అందుకే ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో, తమిళ్ లో సూపర్ హిట్టయిన తనీ ఒరువన్ ను రీమేక్ చేస్తున్నాడు. డాషింగ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు ధృవ అనే టైటిల్ ను అనుకుంటున్నారని ప్రచారం జరిగింది. లేటెస్ట్ గా ధృవ ఫస్ట్ లుక్ అంటూ నెట్ లో ఒక పోస్టర్ హల్ చల్ చేస్తోంది. రెండక్షరాల మధ్య నుంచి బాణం ఎక్కుపెట్టినట్టున్న ఈ టైటిల్ లోగో, ఆసక్తి కలిగిస్తోంది.

అయితే, ఇది అఫీషియల్ కాదని, కేవలం ఫ్యాన్ మేడ్ అని సినీజనాలు అంటున్నారు. రామ్ చరణ్ అఫీషియల్ సోషల్ నెట్ వర్కింగ్ అకౌంట్స్ లో గానీ, మూవీకి సంబంధించిన ఎవరి సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో గానీ ధృవ పోస్టర్స్ లేకపోవడమే అందుక్కారణం. కాగా, సినిమా కోసం చెర్రీ ఫిట్ నెస్ ట్రైనింగ్ తీసుకోవడమే కాక, పోలీసాఫీసర్ గా ఫిజిక్ కరెక్ట్ గా కనిపించడం కోసం జిమ్ లో గంటల తరబడి గడిపేస్తున్నాడట. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో అరవింద స్వామి విలన్ గా నటిస్తుంగా, హిప్ హాప్ తమిజ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మూవీ దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. సరైనోడు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ నిర్మిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.