English | Telugu

"రచ్చ"లో విశ్వంగా రామ్ చరణ్

"రచ్చ"లో విశ్వంగా రామ్ చరణ్ నటిస్తున్నాడని విశ్వసనీయవర్గాలద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే మెగా సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, తమన్నా హీరోయిన్ గా, సంపత్ నంది దర్శకత్వంలో, యన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ సంయుక్తంగా నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం "రచ్చ". ఈ "రచ్చ" చిత్రం షూటింగ్ శ్రీలంక, చైనా దేశాల్లో జరిపారు. అలాగే మన దేశంలో కేరళ, హైదరాబాద్ వంటి వివిధ ప్రదేశాల్లో షూటింగ్ జరుపుకుంది "రచ్చ" చిత్రం.

ఈ "రచ్చ" చిత్రంలో హీరో రామ్ చరణ్ పేరు విశ్వం అని తెలిసింది. ఈ "రచ్చ" చిత్రం కారు రేసుల నేపథ్యంలో చాలా స్టైలిష్ గా సాగుతుందట. ఈ "రచ్చ" చిత్రంలో ప్రకాష్ రాజ్, ముఖేష్ రుషి, అజ్మల్, రవిబాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో కర్నూల్ లో ఫిబ్రవరి 26 వ తేదీన విడుదల కానుంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.