English | Telugu

"3ఎ.యమ్.ఫ్రెండ్ అంటే ఏంటి..?" చెర్రీ

"3ఎ.యమ్.ఫ్రెండ్ అంటే ఏంటి..?" అని చెర్రీ అడిగాడట. వివరాల్లోకి వెళితే ఈ మధ్య రానా తన 3ఎ.యమ్.ఫ్రెండ్ అని ప్రముఖ హీరోయిన్ త్రిష ఒక ఇంటర్ వ్యూలో తెలిపింది. అప్పటి నుంచీ ఈ 3ఎ.యమ్.ఫ్రెండ్ అంటే ఏమిటనే సంగతి చాలా మంది సినీ ప్రముఖులకు అర్థం కాలేదు. అలాగే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి కూడా అర్థం కాలేదు. అతను తన చిన్ననాటి స్నేహితుడు రానానే ఈ విషయం గురించి అడిగితే 3ఎ.యమ్.ఫ్రెండ్ అంటే ఆ సమయంలో మనల్ని జాగ్రత్తగా మన ఇంటికి దించే స్నేహితుడు అని అర్థమన్నాడు.

3ఎ.యమ్.ఫ్రెండ్ అంటే మనం బాగా మందుకొట్టి బాగా మత్తులో ఉన్నప్పుడు మనల్ని క్షేమంగా చేర్చగలిగే స్నేహితుడు అని అర్థం. ఈ విషయాన్ని బి.వి.యస్.రవి, దర్శకుడు దేవకట్టా కూడా రామ్ చరణ్ కి విశదీకరించారు. ఈ విషయం ప్రస్తుతం యూత్ లో బాగా పాప్యులరయ్యింది. అది అబ్బాయిలైనా, అమ్మాయిలైనా అందరికీ 3ఎ.యమ్.ఫ్రెండ్ ఉండటం కంపల్సరీగా మారింది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.