English | Telugu
కాజల్ గురించి రకుల్ ప్రీత్ సింగ్ కీలక వ్యాఖ్యలు..మరి నన్ను తొలగిస్తే ఊరుకుంటానా
Updated : Oct 14, 2024
అతి తక్కువ సమయంలోనే తెలుగునాట స్టార్ హీరోలందరితో జోడి కట్టి,టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లిన నార్త్ ఇండియన్ భామ రకుల్ ప్రీత్ సింగ్(rakul preet singh)తెలుగు నాట కెరీర్ పీక్ లో ఉన్నప్పుడే బాలీవుడ్ లో అడుగుపెట్టి వరస పరాజయాలతో వెనక్కి వెళ్ళింది.కొన్ని నెలల క్రితమే పెళ్లి కూడా చేసుకున్న రకుల్ ప్రస్తుతం హిందీలో అజయ్ దేవగన్ తో కలిసి దేదేప్యార్ దే 2 లో చేస్తుంది.రీసెంట్ గా ఒక ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
రకుల్ మాట్లాడుతూ నా కెరియర్ స్టార్టింగ్ లోనే ప్రభాస్(prabhas)సరసన ఒక సినిమా ఆఫర్ వచ్చింది.నాపై ఒక షెడ్యూల్ ని కూడా చిత్రీకరించారు. అప్పుడు నేను ఢిల్లీలో చదువుకుంటుండంతో షెడ్యూల్ పూర్తి కాగానే ఢిల్లీకి వెళ్ళిపోయాను. ఆ తర్వాత రెండో షెడ్యూల్ కోసం నాకు ఫోన్ రాలేదు.అప్పటికే ప్రభాస్, కాజల్ స్థానంలో ఒక సినిమా వచ్చి విజయం సాధించడం వలన మరోసారి ఆ జోడి రిపీట్ అయితే బాగుంటుందని,నన్ను తొలగించి నా ప్లేస్ లో కాజల్ ని తీసుకున్నారు.ఆ విషయంలో కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు.
సినిమా అనేది ఒక వ్యాపారం.ఇందులో కొత్తగా వచ్చిన అమ్మాయిలకి అలా జరగడం సహజం.నాకు ఎన్నో సార్లు అలా జరిగింది. కానీ ఒక అవకాశం పోతే అంతకంటే ఎక్కువ అవకాశం మన కోసం ఎదురు చూస్తుంటుందని నేను నమ్ముతానని చెప్పుకొచ్చింది. గతంలో కూడా నాకు దక్కని వాటి గురించి అలోచించి టైం వేస్ట్ చేసుకోను.ఏం చేస్తే నేను ఎదుగుతానో వారి గురించే ఆలోచిస్తాను అని చెప్పింది.ఇకప్రభాస్, కాజల్ కాంబోలో వచ్చిన మొదటి మూవీ డార్లింగ్ కాగా రెండో మూవీ మిస్టర్ పర్ఫెక్ట్(mister perfect)2011 లో వచ్చిన ఆ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. రకుల్ అదే సంవత్సరం తమిళ,తెలుగు భాషల్లో ఒకే సారి విడుదలైన కెరటం ద్వారా తెలుగు సినీరంగానికి పరిచయం అయ్యింది.