Read more!

English | Telugu

తెలుగులో కబాలీ హక్కుల రేటు అంతేనా...?

రజనీకాంత్ కబాలీపై తెలుగు తమిళ రాష్ట్రాల్లో భారీ అంచనాలే ఉన్నాయి. టీజర్ ఆకట్టుకోవడం దీనికి ప్రధాన కారణం. మళ్లీ ఒకప్పటి రజనీ కనిపిస్తున్నాడంటూ రజనీ ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అయితే ఇన్ని అంచనాలున్న కబాలీ తెలుగు హక్కులు మాత్రం కాస్త తక్కువకే అమ్ముడయ్యాయి. విషయంలోకి వెళ్తే, 2010లో రిలీజైన రోబో సినిమా హక్కుల్ని తెలుగు పంపిణీదారులు 27 కోట్లకు దక్కించుకున్నారు. ఇది ఆరేళ్ల క్రితం నాటి మాట. అంటే ఇప్పుడు కబాలీకి ఉన్న క్రేజ్ కు రజనీ సినిమాకు మినిమం 40 కోట్లు పలుకుతుందని అందరూ భావించారు. కానీ కేవలం 31 కోట్లకే తెలుగు హక్కులు అమ్ముడయ్యాయని సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది చాలా తక్కువే. వరసగా తన రెండు ఫ్లాపులతో డీలా పడ్డ డిస్ట్రిబ్యూటర్లను ఆదుకునేందుకు రజనీయే రైట్స్ ను తగ్గించమన్నారనే ప్రచారం కూడా ఉంది. రోబో టైం తో పోలిస్తే, ఇప్పుడు టిక్కెట్ రేట్లు కూడా బాగానే పెరిగాయి. దీని బట్టి చూస్తే, సినిమాకు హిట్ టాక్ వచ్చిందంటే రజనీ గత సినిమాలు ఇచ్చిన లోటును, కబాలీతో డిస్ట్రిబ్యూటర్లు క్లియర్ చేసుకోవచ్చు. ఆ లోటు దాటేసి లాభాలు వెనకేసుకున్నా ఆశ్చర్యం లేదు. ఇక కబాలీ తెలుగు రిలీజ్ కు ఏ అడ్డంకీ లేనట్లే మరి.