Read more!

English | Telugu

బైక్స్ పంచి పెట్టిన లారెన్స్..ఇల్లు కూడా ఇస్తాడంట 

కొరియోగ్రాఫర్ గా  సినీ జీవితాన్ని ప్రారంభించి దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా  ముందుకు దూసుకుపోతున్న వ్యకి రాఘవలారెన్స్. అన్ని రంగాల్లోను విజయం సాధించిన వ్యక్తిగా కూడా రికార్డు సృష్టించాడు.నేడు లారెన్స్ గురించి తెలియని దక్షిణ భారతీయ సినీ ప్రేమికుడు లేడు. సంఘ సేవకుడిగా  కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తు రియల్ హీరో అనిపించుకున్నాడు. తాజాగా ఆయన చేసిన ఒక పని టాక్ అఫ్ ది డే గా నిలిచింది.

దివ్యాంగులు, అనాధబాలల ని లారెన్స్ తన సొంత వాళ్లలా భావిస్తాడు.వాళ్ళకి ధైర్యాన్ని, జీవితం మీద ఆశని కలిపించడంలో ఎప్పుడు ముందుంటాడు. వాళ్ళు కూడా మాకు లారెన్స్ ఉన్నాడనే  గుండె నిబ్బరంతో ఉంటారు. కొన్ని రోజుల క్రితం లారెన్స్  ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసాడు. అందులో  దివ్యాంగులు కి  బైక్ లని ఇవ్వడంతో పాటుగా ఇల్లు కట్టిస్తానని అనౌన్స్ చేసాడు. అన్నట్టుగానే  ఇప్పుడు ఆ మాటని నిలబెట్టుకున్నాడు. మొత్తం 13 మందికి బైక్స్ ని కొని ఇచ్చాడు. పైగా వాళ్ళకి అనుకూలంగా ఉండేలా  త్రీ వీలర్స్ గా కూడా వాటిని  మార్పించనున్నాడు.

లారెన్స్ బైక్స్ ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో ఉంది.  తన ఇంట్లో ఉన్న రాఘవేంద్ర స్వామి విగ్రహం దగ్గరకి వాళ్ళని తీసుకెళ్లి స్వామి దగ్గర ఆశీర్వాదం తీసుకొని  బైక్స్ ని అందించాడు. బైక్స్ ని అందుకున్న వాళ్ళ ఆనందాన్ని అయితే మాటల్లో చెప్పలేం. అలాగే  ఇంటిని కూడా త్వరలోనే  కట్టిస్తానని చెప్పాడు. ఇక కెరీర్ పరంగా చూసుకుంటే ఈ  ఏడాది ఇంకా లారెన్స్ సినిమాలు ఏం రాలేదు. గత ఏడాది  చంద్రముఖి 2 , జిగర్తాండ డబుల్ ఎక్స్ లు వచ్చాయి. రెండు కూడా మిశ్రమ ఫలితాన్నే సాధించాయి. ప్రస్తుతం దుర్గ అనే మూవీలో చేస్తున్నాడు.