Read more!

English | Telugu

శ్రీలంకలో రామ్ చరణ్, సంపత్ నంది రచ్చ

శ్రీలంకలో రామ్ చరణ్, సంపత్ నంది "రచ్చ" సినిమా షుటింగ్ జరుగుతుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే మెగా సూపర్ గుడ్ పతాకంపై, యువ హీరో రామ్ చరణ్ తేజ హీరోగా, మిల్కీవైట్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా, "ఏమైంది ఈ వేళ" సినిమా ఫేం సంపత్ నంది దర్శకత్వంలో, యన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమ" రచ్చ". రామ్ చరణ్ "రచ్చ" సినిమా జూన్ మొదటి తేదీన హైదరాబాద్ లో లాంఛనంగా ముహూర్తం ప్రారంభించుకుంటుంది.

ఆ తర్వాత జూన్ మూడవ తేదీ నుండి శ్రీలంక దేశంలో షుటింగ్ జరుపుకుంటుంది. శ్రీలంకలో రామ్ చరణ్ "రచ్చ" సినిమాకి షూటింగ్ కోసం అనువైన ప్రదేశాలను ఈ సినిమా యూనిట్ ఇప్పటికే పరిశీలించింది. రామ్ చరణ్ "రచ్చ" సినిమాకి మణిశర్మ  సంగీతాన్ని అందిస్తున్నారు. రామ్ చరణ్ "రచ్చ" సినిమా పూర్తిగా కమర్షియల్ మాస్ ఎంటర్ టైనర్ మూవీ అని ఈ సినిమా యూనిట్ చెపుతోంది.