Read more!

English | Telugu

పుష్ప పుష్ప పుష్ప పుష్పరాజ్.. ఇదేందయ్యా ఇది!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్ లో వచ్చిన 'పుష్ప' చిత్రం.. 2021 డిసెంబర్ లో విడుదలై పాన్ ఇండియా వైడ్ గా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు ఈ కాంబో.. 'పుష్ప-2' (Pushpa 2) తో అంతకుమించిన సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతోంది. ఆగస్టు 15న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక ఇప్పుడు ఈ మూవీ ఫస్ట్ సింగిల్ విడుదలకు ముహూర్తం ఖరారైంది.

'పుష్ప-2' ఫస్ట్ సింగిల్ గా టైటిల్ సాంగ్ విడుదల కానుంది. "పుష్ప.. పుష్ప.. పుష్ప.. పుష్పరాజ్" #PushpaPushpa అంటూ సాగే ఈ సాంగ్ లిరికల్ ప్రోమోని తాజాగా విడుదల చేశారు. 20 సెకన్ల నిడివి గల ఈ ప్రోమోతోనే మ్యూజిక్ ఏ రేంజ్ లో ఉండబోతుందో చెప్పేశారు. ఫుల్ సాంగ్ మే 1న ఉదయం 11:07 కి రిలీజ్ కానుంది.

'పుష్ప-1' విజయంలో సంగీతం కీలక పాత్ర పోషించింది. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలన్నీ పెద్ద హిట్ అయ్యాయి. 'ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా', 'ఊ అంటావా మావా', 'శ్రీవల్లి', 'సామి సామి', 'దాక్కో దాక్కో'.. ఇలా అన్ని పాటలూ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయ్యాయి. అందుకే 'పుష్ప-2' సాంగ్స్ పై (Pushpa 2 Songs) ఓ రేంజ్ లో అంచనాలున్నాయి. మరి ఇప్పుడు 'పుష్పరాజ్' పాత్రని ఎలివేట్ చేస్తూ వస్తున్న "పుష్ప పుష్ప" సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.