English | Telugu
ఫస్ట్ ఇండియన్ మూవీగా పుష్ప 2 సరికొత్త రికార్డు..కొంచం జాలి చూపించవయ్యా
Updated : Dec 26, 2024
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్(allu arjun)వన్ మాన్ షో పుష్ప 2(pushpa 2)రిలీజైన రోజు నుంచి అనేక రికార్డులని తన ఖాతాలో వేసుకుంటున్న విషయం తెలిసిందే.ఇప్పటికే తొలిరోజు హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన విషయంలోను,కేవలం ఆరు రోజుల్లోనే 1000 కోట్లు సాధించిన విషయంలోను తొలి భారతీయ సినిమాగా నిలిచింది.హిందీలో ఇప్పటికే 700 కోట్ల నెట్ కలెక్షన్ ని సాధించిందంటే పుష్పరాజ్ హవాని అర్ధం చేసుకోవచ్చు.
రీసెంట్ గా పుష్ప 2 మరో అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకుంది.కేవలం ఇరవై ఒక్క రోజుల్లోనే 1705 కోట్ల గ్రాస్ ని అందుకున్న తొలి బారతీయ మూవీగా నిలిచింది.దీంతో ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్స్ ని సాధించిన కేజీఎఫ్ పార్ట్ 2 (1250 కోట్లు), ఆర్ఆర్ఆర్ (1300 కోట్లు) రికార్డుని దాటేసి బాహుబలి 2 (1800 కోట్లు) ని బీట్ చేసే దిశగా వెళ్తుంది.బాహుబలి 2 కి టోటల్ రాంగ్ రన్ లో 1800 కోట్లు వచ్చిన దృష్ట్యా పుష్ప 2 ఆ రికార్డుని లాంగ్ రన్ లో ఈజీగా దాటే అవకాశం ఉంది.
ఇక పుష్ప 2 ఓటిటి వేదికగా జనవరి రెండో వారం నుంచి స్ట్రీమింగ్ కాబోతుందనే వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.ఇప్పుడు ఈ వార్తలపై పుష్ప 2 మేకర్స్ స్పందిస్తు పుష్ప 2 థియేటర్ రిలీజైన రోజు నుంచి యాభై ఆరు రోజుల తర్వాతే ఓటిటి లోకి స్ట్రీమింగ్ కి వస్తుందని చెప్పారు