English | Telugu

పుష్ప 2 పబ్లిక్ టాక్ పరిస్థితి ఇదే 

ఈ రోజు ఇండియా వైడ్ గా ఉదయం ఐదు గంటల ఆటతో  పుష్ప 2(pushpa 2)అల్లు అర్జున్(allu arjun)కెరిరీ లోనే నెంబర్ ఆఫ్ థియేటర్స్ లో విడుదలయ్యింది. నిన్న నైట్ నుంచే పెద్ద ఎత్తున  ప్రీమియర్ షోస్ ని కూడా జరుపుకోగా అల్లు అర్జున్ అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి పోటెత్తడంతో థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కూడా నెలకొని ఉంది.

ఇక మూవీ చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే సినిమా చాలా బాగుందని, అల్లు అర్జున్ పుష్ప క్యారక్టర్ లో మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించాడనే  మాట చెప్తున్నారు.యాక్షన్ సీక్వెన్స్ లో గాని, డాన్సుల్లో గాని తనదైన మార్కుని చూపించాడని,ముఖ్యంగా జాతర సీన్ అయితే చాలా బాగా వచ్చిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.కాకపోతే కొంత మంది మాత్రం మూవీ పట్ల డిజప్పా  యింట్ గా ఉన్నారు. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు

పుష్ప 1 హిట్ తర్వాత పుష్ప 2 పై భారీగా అంచనాలు పెరగడం, పైగా అల్లు అర్జున్ మూడేళ్ళ తర్వాత రావడంతో కొంత మందిలో పుష్ప 2 పై భారీగా అంచనాలు పెట్టుకున్నారు. దాంతో ఆ క్రేజ్ ని అందుకోవడం కొంచం కష్టమైంది.అందుకే కొంత మంది లెక్కల మాస్టర్ సుకుమార్(sukumar)లెక్క తప్పిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా మూవీకి వెళ్తే డిజప్పాయింట్ అవ్వరని సినీ ట్రేడ్ వర్గాలు వారు వ్యక్తం చేస్తున్నారు.