English | Telugu

తెలంగాణ సర్కార్‌ ‘పుష్ప2’ కోసం పెంచిన టికెట్‌ రేట్లు ఇవే!

డిసెంబర్‌ 5న విడుదల కాబోతున్న అల్లు అర్జున్‌, సుకుమార్‌ల ‘పుష్ప2’ చిత్రానికి రేవంత్‌రెడ్డి సర్కార్‌ వరాల జల్లు కురిపించింది. అదనపు షోల విషయంలో, టికెట్ల రేట్లు పెంచుకునే విషయంలో తెలంగాణ ప్రభుత్వం తన ఉదారతను చాటుకుంది. డిసెంబర్‌ 4 రాత్రి గం.9.30ల నుంచి బెనిఫిట్‌ షోలు వేసుకునే వీలు కల్పించారు. సింగిల్‌ స్క్రీన్స్‌ అయినా, మల్టీప్లెక్స్‌లు అయినా టికెట్‌ ధరను రూ.800గా నిర్ణయించారు. ఈ ధర బెనిఫిట్‌ షోకు మాత్రమే వర్తిస్తుంది. సింగిల్‌ స్క్రీన్స్‌లో డిసెంబర్‌ 5 నుంచి 8 వరకు రూ.150, డిసెంబర్‌ 9 నుంచి 16 వరకు రూ.104, డిసెంబర్‌ 17 నుంచి 23 వరకు రూ.20లను ప్రతి టికెట్‌పై అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక మల్టీప్లెక్స్‌లలో పైన పేర్కొన తేదీల ప్రకారం రూ.200, రూ.150, రూ.50లను ప్రతి టికెట్‌పై అదనంగా చెల్లించాలి. అలాగే డిసెంబర్‌ 5న అర్థరాత్రి ఒంటిగంటకు, తెల్లవారు జామున గం4.30లకు వేసే షోలకు కూడా ఇవే రేట్లు వర్తిస్తాయి.