Read more!

English | Telugu

టీ గ్లాస్ పట్టుకున్న అల్లు అర్జున్.. అసలు తగ్గేదేలే!

ప్రస్తుతం ఎక్కడ చూసినా 'పుష్ప' పేరు మోతమోగిపోతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్ లో వచ్చిన 'పుష్ప' చిత్రం.. 2021 డిసెంబర్ లో విడుదలై పాన్ ఇండియా వైడ్ గా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు ఈ కాంబో.. అంతకుమించిన సంచలనం సృష్టించడానికి 'పుష్ప-2' (Pushpa 2) తో రాబోతుంది. ఆగస్టు 15న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది.

'పుష్ప-2' ఫస్ట్ సింగిల్ (Pushpa 2 First Single) గా  "పుష్ప.. పుష్ప.. పుష్ప.. పుష్పరాజ్" అంటూ సాగే టైటిల్ సాంగ్ రిలీజ్ అయింది. ఈ లిరికల్ వీడియో గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. దేవి శ్రీ ప్రసాద్ మరోసారి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. చంద్రబోస్ కూడా పదునైన లిరిక్స్ తో మరోసారి తన కలం బలం చూపించాడు. దేవి శ్రీ సంగీతం, చంద్రబోస్ సాహిత్యానికి తగ్గట్టుగా.. నకాష్ అజీజ్, దీపక్  బ్లూ ల గాత్రం కూడా పవర్ ఫుల్ గా ఉంది. మొత్తానికి "పుష్ప.. పుష్ప" గీతం మోత మోగించేలా ఉంది. 

ఇక లిరికల్ వీడియోలో అల్లు అర్జున్ స్టెప్పులు, మ్యానరిజమ్స్ హైలైట్ గా నిలిచాయి. టీ గ్లాస్ పట్టుకొని బన్నీ వేసిన స్టెప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక 'పుష్ప-1'లో 'తగ్గేదేలే' అన్న అల్లు అర్జున్.. ఈసారి 'అసలు తగ్గేదేలే' అంటూ సర్ ప్రైజ్ చేశాడు.

'పుష్ప-1' విజయంలో సంగీతం కీలక పాత్ర పోషించింది. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలన్నీ పెద్ద హిట్ అయ్యాయి. 'ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా', 'ఊ అంటావా మావా', 'శ్రీవల్లి', 'సామి సామి', 'దాక్కో దాక్కో'.. ఇలా అన్ని పాటలూ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయ్యాయి. ఇప్పుడు 'పుష్ప-2' సాంగ్స్ (Pushpa 2 Songs) కి కూడా ఆ రేంజ్ రెస్పాన్స్ వస్తుందేమో చూడాలి.