Read more!

English | Telugu

పుల్లెల గోపీచంద్ బయోపిక్ లో సుధీర్ బాబు..!

సుధీర్ బాబు బాలీవుడ్ రంగప్రవేశం బాగానే కలిసొచ్చినట్టుంది. లేటెస్ట్ గా సుధీర్ హీరోగా ఒక బాలీవుడ్ సినిమా తెరకెక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫ్యామస్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ బయోపిక్ లో హీరోగా సుధీర్ బాబు చేస్తున్నాడని సమాచారం. నిజానికి  గోపీచంద్ బయోపిక్ లో హీరోగా చేయాలనేది సుధీర్ బాబు కల. సుధీర్ స్వతహాగా బ్యాడ్మింటన్ ప్లేయరే కాక, గోపీచంద్ తో అతనికి చాలా మంచి స్నేహబంధం ఉంది. గోపీచంద్ కూడా తన బయోపిక్ ఒకవేళ తెరకెక్కితే, సుధీర్ కరెక్ట్ గా న్యాయం చేయగలడు అని స్వయంగా చెప్పాడు. బాఘీ సినిమాతో విలన్ గా బాలీవుడ్ కు పరిచయం కావడంతో, ఇక ఈ బయో పిక్ కు కూడా మార్గం సుగమమైనట్లే అనేది బాలీవుడ్ సినీజనాల అభిప్రాయం. ఇప్పటికే ఈ సినిమాకు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసేశారని, గుంటూర్ టాకీస్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో రిలీజైన బయోపిక్స్ అన్నీ మంచి పేరు, డబ్బు సంపాదిస్తున్నాయి. ఇదే కాక, ఒక తమిళ సినిమా హిందీ రీమేక్ లో కూడా సుధీర్ నటిస్తున్నాడు. ముందాసుపట్టి అనే ఆ తమిళ సినిమా 1980లో జరిగే పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కబోతుందట. ఓ పక్క బావ మహేష్ ఇప్పటికీ బాలీవుడ్ లో అడుగుపెట్టడానికి ఆలోచిస్తుంటే, సుధీర్ ఏకంగా వరస సినిమాలతో బిజీ అయిపోవడం విశేషం.