English | Telugu

పృథ్వీరాజ్ సుకుమారన్ పై ఐటి గురి..ఎల్ 2 ఎంపురాన్ విషయంలో కాదు

పృథ్వీరాజ్ సుకుమారన్ పై ఐటి గురి..ఎల్ 2 ఎంపురాన్ విషయంలో కాదు

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(MOhanlal)మరో సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran)కాంబోలో మార్చి 27 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ 'ఎల్ 2 ఎంపురాన్'(L2 Empuraan).లూసిఫర్ కి పార్ట్ 2 గా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు 200 కోట్ల కి పైగా కలెక్షన్ ని సాధించి ముందుకు దూసుకెళ్తుంది.ఇక ఈ మూవీలో పృథ్వీ రాజ్ సుకుమారన్ కూడా మసూద్ అనే క్యారక్టర్ లో అద్భుతంగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నాడు.

రీసెంట్ గా పృథ్వీ రాజ్ సుకుమారన్ కి ఐటి శాఖ నోటీసులు జారీ చేసింది.2022 లో పృథ్వీ రాజ్ జనగణమన, గోల్డ్, గడువు చిత్రాల్లో నటించడంతో పాటు సహ నిర్మాతగాను వ్యవహరించాడు.కాకపోతే ఈ మూడు చిత్రాలకి నటించినందుకు పారితోషకం తీసుకోకుండా సహ నిర్మాతగా మాత్రమే డబ్బులు తీసుకున్నట్టుగా తెలుస్తుంది.ఈ విషయంపైనే ఆ మూడు సినిమాల ఆదాయ వివరాలని అందించాలని ఐటి శాఖ కోరినట్టుగా వార్తలు వస్తున్నాయి. 

రీసెంట్ గా ఎంపురాన్ నిర్మాతల్లో ఒకరైన 'గోకులం గోపాలన్' ఇంట్లోతో పాటు చిట్ ఫండ్ కంపెనీలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈడీ(Ed)సోదాలు జరిగిన విషయం తెలిసిందే.దీంతో ఇప్పుడు పృథ్వీ రాజ్ సుకుమారన్  పై కూడా ఐటి శాఖ నోటీసులు జారీ చెయ్యడం చర్చినీయాంశమయ్యింది.మూవీలోని కొన్ని సీన్స్ తో పాటు కొన్నిపేర్లు భారతీయ జనతా పార్టీ కి దగ్గరగా ఉన్నాయనే అభ్యంతరాల నేపథ్యంలో చిత్ర బృందం ఆ సీన్స్ ని డిలీట్ చేసింది.ఈ విషయంలో మోహన్ లాల్ క్షమాపణలు కూడా చెప్పాడు.మంజు వారియర్(Manju Warri3r)అభిమన్యు సింగ్,టోవినో థామస్,జెరోమ్ ప్లాన్,ఇంద్రజిత్ సుకుమారన్,కిషోర్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించగా దీపక్ దేవ్ సంగీతాన్ని అందించాడు.