English | Telugu
పారిపోయిన ప్రకాష్ రాజ్..కోటి రూపాయలు నష్టం
Updated : Oct 7, 2024
సనాతన దర్మం గురించి మాట్లాడుతున్న ఏపి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్(pawan kalyan)మీద ప్రముఖ సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్(prakash raj)వరుస ట్వీట్లతో ఎదురుదాడికి దిగుతున్న విషయం అందరకి తెలిసిందే.అసలు పవన్ సైలెంట్ గా ఉన్నా కూడా ప్రకాష్ రాజ్ ఏదో ఒక రకంగా పవన్ ని టార్గెట్ చేసుకొని పలు రకాల వ్యాఖ్యలు చేస్తున్నాడు.రీసెంట్ గా కూడా తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పొగుడుతూ పవన్ కళ్యాణ్ ని విమర్శించాడు. పైగా డిప్యూటీ సిఎం తో ఉన్నాననే క్యాప్షన్ ని ఉంచి అందుకు సంబంధించిన పిక్స్ ని సోషల్ మీడియా లో షేర్ చేసాడు. ఇలాంటి టైం లో ప్రకాష్ రాజ్ గురించి ఒక తమిళ నిర్మాత చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
ఎనిమీ అనే మూవీతో పాటు గత సంవత్సరం విశాల్, ఎస్.జె సూర్య ల కాంబోలో వచ్చిన మార్క్ ఆంటోని వంటి చిత్రాలను నిర్మించిన వినోద్ కుమార్(vinod kumar)మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ వల్ల నాకు కోటి రూపాయల భారీ నష్టం సంభవించింది. గత నెల 30 న 1000 మంది జూనియర్ ఆరిస్టులతో షూటింగ్ చేస్తున్నాం.కానీ వేరే ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ రావడంతో ఎవరకి చెప్పా పెట్టకుండా పారిపోయావు. అలాంటి నువ్వు డిప్యూటీ సీఎంతో ఉన్నాను అంటూ ట్వీట్ చేసావు. వాళ్లంతా ఎన్నికల్లో గెలిచారు. నువ్వు డిపాజిట్లు కూడా దక్కించుకోలేక ఘోరంగా ఓడిపోయావు అంటూ కూడా చెప్పుకొచ్చాడు.
ప్రకాష్ రాజ్ మీద ఇలాంటి ఆరోపణలు గతంలో కూడా చాలానే వచ్చాయి.మన తెలుగు నాట అయితే కొన్నాళ్ళు బ్యాన్ కూడా విధించారు.మరిప్పుడు సెక్యులరిజం పేరిట పవన్ ని మాటి మాటికీ విమర్శిస్తుండటంతో చాలా మంది దర్శక నిర్మాతలు ప్రకాష్ రాజ్ని దూరంగా ఉంచాలనుకుంటున్నారనే వార్తలు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.