Read more!

English | Telugu

ప్రభాస్ ఎన్నారై అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడా..?

ప్రభాస్ ఒక ఎన్నారై అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడా..? ఆ అమ్మాయితో పెళ్లికి ఇంట్లో వాళ్లను ఒప్పించాడా..? త్వరలోనే పెళ్లికి సిద్ధమవుతున్నాడా..? ఒక లీడింగ్ ఇంగ్లీష్ డైలీ న్యూస్ పేపర్లో వచ్చింది ఈ న్యూస్. దాంతో జనాలు ఇదేందిరో కొత్తగా ఉంది అనుకున్నారు. ఇప్పటికే బాహుబలికి పెళ్లి సెట్టయిందన్నారు కదా. మళ్లీ కొత్తగా ఈ ఎన్నారై నేహ ఎవరబ్బా అని అందరికీ డౌట్స్ వచ్చేశాయి. పూర్తిగా చదవకపోతే ఈ డౌట్స్ అలాగే ఉండిపోతాయి. నేహా సౌతాఫ్రికాలో సెటిలైన ఎన్నారై అని, బాహుబలి హిట్టైన తర్వాత ఆమెకు మ్యారేజ్ ప్రపోజ్ చేశాడని, ఇంకా ఏవేవో రాసుకొచ్చింది ఆ పేపర్. ఆ ఆర్టికల్ అంత ఎగ్జైటింగ్ గా చదువుతూ చివరికి వచ్చేసరికి ఓహో ఇదా మ్యాటరు అని అనుకున్నారు జనాలు. ఎందుకంటే అది ఏప్రిల్ ఫూల్ న్యూస్ అట. ఈ న్యూస్ చదివిన తర్వాత చాలామందికి హార్ట్ బ్రేక్ అవుతుంది. అయినప్పటికీ ప్రభాస్ కపుల్ కు వియ్ విష్ హ్యాప్ లైఫ్ ఎహెడ్ అని రాసి, మా రీడర్స్ కు కూడా హ్యాపీ ఫూల్స్ డే అని ముగించింది. కానీ ఇక్కడ ఫూల్ అయింది పేపర్ మీద నమ్మకంతో చదివిన వాళ్లా..? నమ్మి చదువుతున్న వాళ్లను ఫూల్ చేద్దాం అనుకున్న వాళ్లా..? అన్నదే అసలు డౌటు..