English | Telugu

ప్రభాస్ రెబెల్ ఎలా ఉంటుంది

ప్రభాస్ "రెబెల్" ఎలా ఉంటుంది అని యంగ్ రెబెల్ స్టార్ అభిమానులు ఉత్సుకతో ఎదురు చూస్తున్నారు. వివరల్లోకి వెళితే బాలాజీ సినీ మీడియా పతాకంపై, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, అందాల అనుష్క, పొడుగు కాళ్ళ సుందరి దీక్షా సేథ్ హీరోయిన్లుగా, కొరియోగ్రఫర్ కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ దర్శకత్వంలో, జె.భగవాన్, జె.పుల్లారవు సంయుక్తంగా నిర్మిస్తున్న విభిన్నకథాచిత్రం "రెబెల్". ప్రభాస్ "రెబెల్" చిత్రం మాఫియా నేపథ్యంలో జరిగే కథతో నిర్మిస్తున్నారని సమాచారం. ప్రభాస్ "రెబెల్" చిత్రంలో ప్రభస్ పెదనాన్న సీనియర్ నటులు రెబెల్ స్టార్ కృష్ణంరాజు కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారట.

ప్రభాస్ ని సరికొత్తగా ఈ ప్రభాస్ "రెబెల్" చిత్రంలో చూపిస్తున్నారట దర్శకులు లారెన్స్. హీరో ప్రభాస్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ మాడ్యులేషన్, డ్యాన్స్ లూ ఇలా ప్రతి విషయంలోనూ వెరైటీ ఉండేలా జాగ్రత్తపడుతున్నారట. ప్రస్తుతం ప్రభాస్ "మిస్టర్ పర్ ఫెక్ట్" సూపర్ హిట్ అయితే, లారెన్స్ హీరోగా నటించిన "కాంచన" కూడా తెలుగులో హిట్టయ్యింది. కాబట్టి ప్రభాస్ "రెబెల్" బాగానే ఉండే అవకాశాలున్నాయని సినీ పండితులంటున్నారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.