Read more!

English | Telugu

ప్రతాపరుద్రుడుగా ప్రభాస్..?

బాహుబలిలాంటి సినిమా తర్వాత, చారిత్రక, జానపద సినిమాలు ఏవి తీయాలన్నా మొదట ప్రభాసే గుర్తొస్తాడనడంలో ఆశ్చర్యం లేదు. అందుకే ఇప్పుడు గుణశేఖర్ కూడా తన తర్వాతి సినిమా ప్రతాపరుద్రుడి పాత్ర కోసం ప్రభాస్ ను ఒప్పించే పనిలో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. తన రుద్రమ దేవి సినిమా పూర్తవ్వగానే, కంటిన్యూషన్ గా ప్రతాపరుద్రుడు మూవీ వస్తుందని గుణ ముందే చెప్పాడు. కానీ ఆ మూవీలో ప్రతాపరుద్రుడి పాత్ర ఎవరు పోషిస్తారో మాత్రం ఖచ్చితంగా ప్రకటించలేదు. ఇప్పటికే మొదటి సినిమాకు భారీగా పెట్టేసిన గుణ, ఇప్పుడు రెండో సినిమాకు కూడా అంత పెట్టే సాహసం చేయాలంటే, తప్పనిసరిగా జనాన్ని థియేటర్లకు రప్పించే హీరోయే కావాలి.

బాహుబలి తర్వాత ఇండియా వైడ్ ఫ్యామస్ అయిన ప్రభాస్ అయితేనే ఈ పాత్రకు కరెక్ట్ గా ఉంటాడని గుణ అభిప్రాయం. దీని ద్వారా, బాలీవుడ్ కు కూడా సినిమాను మార్కెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటికే బాహుబలి కోసం తన పెళ్లిని సైతం వాయిదా వేసుకుని కష్టపడుతున్న డార్లింగ్, ఇప్పట్లో మళ్లీ మరో జానపద సినిమా సైన్ చేస్తాడా అన్నది అనుమానమే. ఇప్పటికే తన సొంత బ్యానర్ యువీ క్రియేషన్స్ లో ఒక సినిమా చేయడానికి కూడా ఆల్రెడీ కమిట్ అయ్యాడు. ఆ తర్వాత మళ్లీ ప్రతాపరుద్రుడంటూ అప్రోచ్ అయ్యే గుణశేఖర్ ప్లాన్ కు ప్రభాస్ ఒప్పుకుంటాడో లేదో చూడాలి.