Read more!

English | Telugu

కేరళకు పయనమైన పవన్

రాష్ట్రంలో జరిగిన పరిణామాలతో, హడావిడిగా సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ నుంచి హైదరాబాద్ వచ్చి స్పందించిన పవన్, నేడు తిరిగి సినిమా టీం తో జాయిన్ అవనున్నాడు. అనకోకుండా తీసుకున్న ఈ గ్యాప్ ను మరింత పెంచి, ప్రొడ్యూసర్లకు భారం కాకూడదనే ఉద్దేశ్యంతో, తిరిగి కేరళకు పయనమయ్యాడు పవర్ స్టార్.ఈ రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ కంటిన్యూ అవనుంది.సర్దార్ గబ్బర్ సింగ్ లో పవన్ సరసన మొట్టమొదటి సారి కాజల్ జతకడుతుండగా,సంజన, లక్ష్మీరాయ్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.మార్చి 13 న ఆడియో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నార్ సర్దార్ టీం. ఏప్రిల్ 8 న మూవీ థియేటర్లలో సందడి చేయనుంది..కె.యస్.రవీంద్ర(బాబీ) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని పవన్ కళ్యాణ్,శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు..