Read more!

English | Telugu

‘పోరాటం’ మూవీ రివ్యూ


మూవీ : పోరాటం
నటీనటులు : పండు పీవీ, శివ ప్రసాద్, సంఘర్షన్, శశి, నతా నాగేశ్వరరావు తదితరులు
ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ: నాని ఆర్జే
మ్యూజిక్: లియో సూర్య 
నిర్మాతలు: పి. భాను ప్రకాశ్, సిజి పవన్
రచన, దర్శకత్వం: కొడగంటి మురళి

కథ:

ఓ కుర్రాడు చేతిలో కత్తి పట్టుకొని పరుగెడుతుంటాడు. ఆ తర్వాత ఓ ఇంట్లో కృష్ణ వాళ్ళ అమ్మ దోసలు వేస్తూ.. రేయ్ కృష్ణ తినేసి వెళ్ళు రా అంటుంది. కృష్ణ మాత్రం బ్యాగ్ సర్దుకొని బయల్దేరి వెళ్తుంటాడు. ఎక్కడికి రా అని వాళ్ళ అమ్మ అడిగినప్పుడు.. ఇక్కడ మనుషులకి కాస్త దూరంగా వెళ్తున్నానని చెప్తుంటాడు. మరోవైపు ఓ ప్రాంతంలో ఒక స్కూల్ అమ్మాయి తన స్నేహితులతో నడుచుకుంటూ వెళ్తుంటుంది. అయితే తన స్నేహితులకి చెప్పులు ఉండటం, తనకి లేకపోవడంతో తను నిరాశ చెందుతుంది. ఇక సాయంత్రం వాళ్ళ నాన్న ఇంటికి వచ్చినప్పుడు.. తనకు చెప్పులు కావాలని అడుగుతుంది. సరే అని వాళ్ళ నాన్న చెప్పగానే తను సంతోషంగా ఉంటుంది. మరోవైపు అడవిలో కొంతమంది నక్సలైట్లు ఇద్దరు కుర్రాళ్ళని తీసుకెళ్తారు. కృష్ణ అడవికి ఎందుకు వెళ్ళాడు? ఆ పాప తండ్రి చెప్పులు తీసుకొచ్చాడా? ఆ ఇద్దరు కుర్రాళ్ళు ప్రాణాలాతో బయటపడ్డారా లేదా అనేది మిగతా కథ.. 


విశ్లేషణ:

పదేళ్ల కుర్రాడు కత్తితో పరుగెడుతుంటే ఎవరినో చంపి వస్తున్నాడనే క్యూరియాసిటిని పెంచడంలో దర్శకుడు కొడగంటి మురళి సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత కృష్ణ ఫ్యామిలీ గురించి పెద్దగా పరిచయం చేయకుండా డైరెక్ట్ కథలోకి వెళ్ళడంతో కథ ఆసక్తిగా సాగుతుంది.

స్క్రీన్ ప్లే కాస్త కొత్తగా ఉంది. చాలా సహజసిద్ధంగా ఉండేలా మలిచినట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలోని పాత్రలన్నీ కొత్తవే కావడంతో కథ ఉత్కంఠభరితంగా సాగుతుంది. అయితే సినిమా నిడివి కూడా తక్కువే అవ్వడంతో సాటి ప్రేక్షకుడు ఓసారి చూసేద్దాంలే అని అనుకునేలా చేస్తుంది. క్లైమాక్స్ లో విప్లవకారులతో కృష్ణ చెప్పే మాటలు సమాజంలో మార్పుని తెచ్చేవిగా ఉంటాయి.

జనాలు మిమ్మల్ని ఎప్పుడో మరిచిపోయారన్నా.. ఒక్కసారి జనాల్లోకి వచ్చి వారి సమస్యలేంటో తెలుసుకోండి అని చెప్పే మాటలు ఆలోచింపజేసేవిలా ఉంటాయి. ఇక దేశంలో పెరిగిపోతున్న కుల, మత కొట్లటల గురించి సింపుల్ గా ఓ నాలుగు నిమిషాల్లో తేల్చేశాడు. సినిమాలో ఏదీ ఎక్కువ కాకుండా చాలా జాగ్రత్తపడ్డాడు డైరెక్టర్. అడల్ట్ సీన్స్ ఏమీ లేవు. నాన్న కూతురి కోసం చేసే పని .. ఆ. పాప కళ్ళలో సంతోషం అందరికి నచ్చేస్తాయి. నాని ఆర్జే సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ బాగుంది. లియో సూర్య బిజిఎమ్ బాగుంది. కొడగంటి మురళి రచన చక్కగా కుదిరింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు: 

కృష్ణ పాత్రలో పండు పీవీ, భగత్ గా శివ ప్రసాద్, సిద్దార్థ్ గా సంఘర్షన్ సహజసిద్ధంగా నటించారు. ఇక మిగతావారు వారి పాత్రల పరిధి మేర నటించారు.

ఫైనల్ గా : 

అడవుల్లో ఉండి 'పోరాటం' చేసేవారికి జనాల్లోకి రావాలని పీస్ తేవాలని ఇచ్చే మెసేజ్ కన్విన్సింగా ఉంటుంది. ఓ సారి ట్రై చేయొచ్చు.

రేటింగ్:  2.5 / 5 

✍️. దాసరి మల్లేశ్