English | Telugu
అల్లు అర్జున్ అరెస్ట్, విడుదలపై పూనమ్ కౌర్ సెటైర్!
Updated : Dec 14, 2024
గత 24 గంటలుగా అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. సినిమా ఫక్కీలో జరిగిన అరెస్టు, రిమాండ్, చంచల్ గూడ జైలు, హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు, ఈరోజు ఉదయం అల్లు అర్జున్ విడుదల. దీనిపై ఎంతో మంది రాజకీయ, సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను, తమ నిరసనలను వ్యక్తం చేశారు. ఈ 24 గంటల్లో మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది. ఎవరికి తోచిన విధంగా వారు స్పందించారు. నేనేం తక్కువ తిన్నానా అంటూ వివాదాలతో ఎప్పుడూ దోస్తీ చేసే పూనమ్ కౌర్ రంగంలోకి దిగితన అభిప్రాయాన్ని కూడా తెలియజేసింది. ట్విట్టర్‌లో ఆమె పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ అయిపోయింది.
పూనమ్ వేసిన ట్వీట్ విచిత్రంగా ఉంది. అంతేకాదు, దాన్ని అవగాహన చేసుకుంటే అల్లు అర్జున్ అరెస్ట్, దానిపై తెలంగాణ ప్రభుత్వం స్పందించిన తీరు ఇందులో కనిపిస్తాయి. ‘అధికారాన్ని దుర్వినియోగం చేయడమే రాజకీయం.. ఆ అధికారాన్ని ప్రజల అభివృద్దికి వాడటమే నాయకత్వం’ అని ఇన్‌డైరెక్ట్‌గా అల్లు అర్జున్ అరెస్ట్ చేసి అధికార దుర్వినియోగం చేశారని, అదే రాజకీయం అని చెప్పింది. అంతేకాదు, ఆ అధికారాన్ని ప్రజల అభివృద్ధికి వాడటమే నాయకత్వం అని కూడా అన్నారు. ఈ ట్వీట్ పూనమ్ చెప్పాలనుకున్న పాయింట్ ఏమిటంటే.. ‘అధికారం ఉంది కదా అని ఒక ఘటనతో సంబంధం లేని సెలబ్రిటీని అరెస్ట్ చేయడం అధికార దుర్వినియోగం చేయడమే అవుతుంది. అదే రాజకీయం’ అంటూ ‘ఆ అధికారాన్ని ప్రజల అభివృద్ధికి ఉపయోగిస్తేనే దాన్ని నాయకత్వం అంటారు’ అంటూ తెలంగాణ ప్రభుత్వంపై తన నిరసనను వ్యక్తం చేసింది పూనమ్ కౌర్. ఎంతో క్లుప్తంగా, మరెంతో సెటైరికల్‌గా పూనమ్ చేసిన ట్వీట్ అందర్నీ ఆకర్షిస్తోంది. దీంతో ఆ ట్వీట్‌ను షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.