Read more!

English | Telugu

పెళ్లి అయింది నాకు కాదు బాబోయ్ అంటున్న హీరోయిన్..!

నిజం నట్టిల్లు దాటే లోపే, పుకారు ప్రపంచాన్ని చుట్టి వచ్చేస్తుందనేది నానుడి. ఇప్పుడు పూనమ్ బజ్వా కు ఈ నానుడి ఎంత నిజమో తెలిసొచ్చింది. తెలుగులో మొదటి సినిమా, బాస్, పరుగు సినిమాల్లో నటించిన పూనమ్ కు పెళ్లైపోయిందని తెలుగు డైరెక్టర్ ను రహ్యస్యంగా పెళ్లాడిందని గత రెండు మూడు రోజులుగా, వార్తలు వచ్చాయి. లేటెస్ట్ గా ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది పూనమ్. పెళ్లయింది నాకు కాదు, నా సోదరికి అని చెబుతోంది. తన సిస్టర్ కూడా అచ్చం తనలాగే ఉంటుందని, ఆమెను చూసి ఎవరో తను అనుకుని ఈ పుకారును పుట్టించారని క్లారిటీ ఇచ్చింది. అయితే గత కొంతకాలంగా ఆమె ఒక తెలుగు డైరెక్టర్ తో ప్రేమాయణం నడుపుతోందని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఒక మెగాహీరోతో సినిమాను తెరకెక్కిస్తున్న ఆ డైరెక్టర్ తో పెళ్లి వార్తల్ని ఖండించిన పూనమ్, ఎక్కడా కూడా తన ప్రేమ విషయాల్ని ఖండించకపోవడం కొసమెరుపు. దీనిపై సదరు డైరెక్టర్ కూడా నోరు మెదపలేదు. అంటే పెళ్లి వార్తలు పుకార్లే గానీ, లవ్వు నిజమేనా పూనమ్..?