English | Telugu
మందు భామలం.. మేము మందు భామలం..పాయల్ వీడియో వైరల్!
Updated : Mar 16, 2024
కొందరు హీరోయిన్లు వార్తల్లోకి రావడానికి రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. కొందరు వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా, మరికొందరు సెక్సీ ఫోటో షూట్‌ల ద్వారా తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. అలాంటి వారిలో ‘ఆర్‌ఎక్స్ 100’ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఒకరు. ఏదో ఒకవిధంగా సోషల్ మీడియాలో దర్శనమిచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తుంది. దానికి తగ్గట్టుగానే ఆమెను ట్రోల్ చేస్తుంటారు. అలాంటి ట్రోల్స్ కోసమే కొందరు ఎదురుచూస్తారేమో అనిపిస్తుంటుంది. ఈమధ్యకాలంలో పాయల్ ఏది చేసినా విమర్శలు ఎదుర్కొంటోంది. అది ఈమధ్య కాస్త ఎక్కువైందనే చెప్పాలి.
లాక్‌డౌన్ టైమ్‌లో పాయల్‌ను సోషల్ మీడియాలో బాగా ఆడుకున్నారు నెటిజన్లు. దాని గురించి చాలా బాధపడిరది. అయితే రాను రాను అది అలవాటుగా మారిందో ఏమో.. ట్రోలింగ్‌కి ఏమీ భయపడడం లేదు. దానికి తగ్గట్టుగానే ఈమధ్య ఆమెను ట్రోల్ చేయడం కూడా తగ్గించారు నెటిజన్లు. అలా అయితే ఎలా.. అనుకుందో ఏమో.. ఒక కొత్త వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో నలుగురు భామలు మందు గ్లాసులు చేత్తో పట్టుకొని బాత్ టబ్‌లో వయ్యారాలు ఒలకబోస్తున్నారు. ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత మళ్ళీ పాయల్‌పై ట్రోలింగ్ మొదలైంది. ‘ఇదేం వీడియో.. అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా.’ అని, ‘ఈ వీడియో చూస్తుంటే మీరంతా ఏదో తేడాగా కనిపిస్తున్నారే..’ అని రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ఇలాంటి కామెంట్స్ వల్ల పాయల్ పెట్టిన వీడియో మరింత వైరల్ అవుతోంది. ఇటీవల మంగళవారం చిత్రంతో కాస్త హడావిడి చేసిన పాయల్ ప్రస్తుతం ఏ సినిమాలోనూ నటించడం లేదు. ఆమెకు అవకాశాలు ఎందుకు రావడం లేదో ఏమో!