Read more!

English | Telugu

ఇక నుంచీ వర్మ పవన్ గురించి మాట్లాడడట..!

సందు దొరికితే చాలు పవన్ గురించి ఏదొకటి ట్వీట్ చేసే వర్మ, పవన్ గురించి ఇక ట్వీట్ చేయను అంటే నమ్మగలమా..కానీ వర్మ ఇకపై పవన్ గురించి అసలు ట్వీట్ చేయను అంటున్నాడు. మామూలుగానే పవన్ ను షంటే వర్మకు, సర్దార్ ఫ్లాప్ తో మంచి రీజన్ దొరికింది. కానీ కొన్ని పేపర్లకు పవన్ ఇచ్చిన ఇంటర్వ్యూ చూశాడో లేక పవన్ ఫ్యాన్స్ బాధ భరించలేకపోయాడో గానీ, ప్రతీ ఒక్కరూ నేను పవన్ గురించి ఏం మాట్లాడినా అపార్ధం చేసుకుంటున్నారు కాబట్టి, ఇక నా జీవితంలో మళ్లీ పవన్ గురించి ట్వీట్ చేయకూడదని నిర్ణయించుకున్నాను. బైబై పవన్ ఫ్యాన్స్ అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చూసి పవన్ ఫ్యాన్స్ హ్యాపీ ఫీలయ్యారు కానీ, వర్మ తన మాట మీద ఎంతకాలం నిలబడతాడు అన్నదే వాళ్ల డౌటు.